ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడతా..

ABN , First Publish Date - 2021-04-20T10:46:46+05:30 IST

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఈ ఏడాది జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొనబోతున్నాడు. గతేడాది మోకాలి సర్జరీ కారణంగా అతడు

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడతా..

పారిస్‌: టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఈ ఏడాది జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొనబోతున్నాడు. గతేడాది మోకాలి సర్జరీ కారణంగా అతడు ఈ గ్రాండ్‌స్లామ్‌కు దూరంగా ఉన్నాడు. ‘జెనీవాలో జరిగే టోర్నీతో పాటు ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ ఆడబోతున్నా. అప్పటివరకు ప్రాక్టీ‌స్‌లో ఉంటాను. స్విట్జర్లాండ్‌లో మళ్లీ ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని ట్విటర్‌లో ఫెడెక్స్‌ తెలిపాడు. కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్స్‌ సాధించిన ఫెడరర్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ను ఒక్కసారి (2009లో) మాత్రమే గెలిచాడు. 2019లో చివరిసారిగా పాల్గొన్న అతను సెమీ్‌సలో నడాల్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు.

Updated Date - 2021-04-20T10:46:46+05:30 IST