Abn logo
Mar 9 2021 @ 15:41PM

హ్యాట్రిక్ సినిమాతో ప్రగ్యా జైస్వాల్‌కి లైఫ్ వస్తుందా..?

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో టాలీవుడ్‌లో బాగానే పేరు తెచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జంటగా ఎంతో హుందాతనంగా కంచె సినిమాలో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆచారి అమెరికా యాత్ర, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక వంటి సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లో చెప్పుకోవడానికి పెద్ద హిట్ అంటూ లేకపోవడం ఆశ్చర్యకరం. నక్షత్రం, జయ జానకి నాయక సినిమాలలో గ్లామర్ ట్రీట్ కూడా ఇచ్చింది. అయినా జనాలను అంతగా ఆకట్టుకోలేక రేస్‌లో వెనకబడింది. అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిబి3 లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ దగ్గర్నుంచి పలువురు హీరోయిన్స్‌ని పరిశీలించారు. ఇద్దరు హీరోయిన్స్‌ని ఫైనల్ చేసి కూడా మళ్ళీ తప్పించారు.  

ఈ క్రమంలో ప్రగ్యా జైస్వాల్‌ని బాలయ్య సరసన నటించడానికి మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. ఇంతక ముందు బాలయ్య - బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి భారీ హిట్స్ అందుకున్నాయి. ఇలాంటి సమయంలో బిబి3లో ఛాన్స్ అంటే లక్కే అంటున్నారు. ఈ సినిమా గనక హిట్ అయితే యంగ్ హీరోల సరసన కాకపోయినా.. సీనియర్ హీరోల సినిమాలలోనైనా ప్రగ్యాకి అవకాశాలు దక్కుతాయంటున్నారు. అయితే బిబి3 బ్లాక్ బస్టర్ అయి అందులో ప్రగ్యాకి పేరొస్తేనే. మరి బాలయ్య - బోయపాటి శ్రీనుల ఈ హ్యాట్రిక్ సినిమా ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇక బాలీవుడ్‌లో కూడా ప్రగ్యా జైస్వాల్ ఒక సినిమా చేస్తోంది. ఎప్పటి నుంచో హిందీ సినిమాలలో నటించాలని తెగ ఆరాటపడేది. ఎట్టకేలకి ఆ అవకాశం ఇప్పుడు దక్కించుకుంది. ఈ సినిమా గనక హిట్ అయితే ప్రగ్యా జైస్వాల్‌కి వరసగా బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తాయంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement