Apr 20 2021 @ 09:11AM

రవితేజ ఆ ముగ్గురికి లైఫ్ ఇస్తాడా..?

మాస్ మహారాజ రవితేజ క్రాక్‌తో ట్రాక్ ఎక్కి మళ్ళీ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజకి క్రాక్ సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించిన శృతి హాసన్‌కి కూడా మూడేళ్ళ తర్వాత లైఫ్ వచ్చింది. మూడేళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చేసింది. ఆ తర్వాత మళ్ళీ క్రాక్‌తోనే హిట్ అందుకొని ఫాంలోకి వచ్చింది. కాగా ఇప్పుడు శృతి హాసన్ మాదిరిగా మరో ముగ్గురు హీరోయిన్స్‌కి రవితేజ హిట్ ఇస్తే వాళ్ళు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్స్‌గా మారతారని చెప్పుకుంటున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమా చేస్తున సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 

సీనియర్ స్టార్ హీరో అర్జున్, హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి ఖిలాడి సక్సస్ మీదే నమ్మకాలు పెట్టుకున్నారట.  మీనాక్షీ చౌదరి ఇప్పటికే ఒక సినిమా చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక డింపుల్ హయాతి..వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో సూపర్ హిట్టు సాంగ్‌లో కనిపించింది. డింపుల్ హయాతికి హీరోయిన్‌గా ఖిలాడి మొదటి సినిమా. ఇక రవితేజ ఉగాది రోజున కొత్త సినిమాని మొదలు పెట్టాడు. శరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. మజిలీ సూపర్ హిట్ అయినా దివ్యాంశ కౌశిక్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. అందుకే ఈ బ్యూటీ కూడా రవితేజ మీదే నమ్మకాలు పెట్టుకుంది. మరి ఈ ముగ్గురికి రవితేజ లైఫ్ ఇస్తాడా లేదా చూడాలి. కాగా మే 28న రిలీజ్‌ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.