అధికారంలోకి వస్తే గ్రీన్‌కార్డ్, హెచ్1బీ ఆంక్షలను ఎత్తివేస్తాం: డెమొక్రటిక్ పార్టీ

ABN , First Publish Date - 2020-08-06T02:31:40+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ట్రంప్ ప్రభుత్వం గ్రీన్‌కార్డులు, హెచ్1బీ వీసాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని డెమొక్రటిక్ పార్టీ వెల్లడించింది. అంతేకాకుండా గ్రీన్‌కార్డుల విషయంలో ఉన్న బ్యాక్‌లాగ్‌ను సైతం త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని 2020 డెమొక్రటిక్ పార్టీ ప్లాట్‌ఫామ్ తెలిపింది.

అధికారంలోకి వస్తే గ్రీన్‌కార్డ్, హెచ్1బీ ఆంక్షలను ఎత్తివేస్తాం: డెమొక్రటిక్ పార్టీ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ట్రంప్ ప్రభుత్వం గ్రీన్‌కార్డులు, హెచ్1బీ వీసాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని డెమొక్రటిక్ పార్టీ వెల్లడించింది. అంతేకాకుండా గ్రీన్‌కార్డుల విషయంలో ఉన్న బ్యాక్‌లాగ్‌ను సైతం త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని 2020 డెమొక్రటిక్ పార్టీ ప్లాట్‌ఫామ్ తెలిపింది. భారతదేశంలో ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా అయితే ఉంటుందో.. అమెరికాలో పార్టీ ప్లాట్‌ఫామ్ అని ఉంటుంది. దీనిద్వారా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ఆయా పార్టీలు చెబుతాయి. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డులను ప్రభుత్వం జారీ చేస్తుంది. అయితే వీటిపై ఈ ఏడాది చివరి వరకు ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు అమెరికాలో విదేశీయులు పనిచేసుకునేందుకు వీలుగా జారీ చేసే హెచ్1బీ వీసాలపై కూడా ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. 


2020 డెమొక్రటిక్ పార్టీ ప్లాట్‌ఫామ్‌లో డెమొక్రటిక్ పార్టీ ఇమ్మిగ్రేషన్‌ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 90 పేజీలున్న ఈ పార్టీ ప్లాట్‌ఫామ్‌లో డెమొక్రటిక్ పార్టీ ఏం చెప్పుకొచ్చిందంటే.. ‘లేబర్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాశ్వత, ఉపాధి ఆధారిత వీసాలను జారీ చేయడం పట్ల డెమొక్రటిక్ పార్టీ మద్దతిస్తోంది. నైపుణ్యం కలిగిన విదేశీయులను ఆకర్షించి వారిని అమెరికాలోనే ఉంచాలని మేము కోరుకుంటున్నాము. అందుకే డెమొక్రట్లు చట్టబద్దమైన, శాశ్వత వలసలకు సంబంధించిన అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా వాటిని మరింత పెంచడంపై నమ్మకం ఉంచుతుంది. చట్టబద్దమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన అస్తవ్యస్తమైన మార్పులను డెమొక్రట్లు వ్యతిరేకిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వస్తే ఇమ్మిగ్రేషన్‌లో అనేక సంస్కరణలను చేపడుతుంది. ఈ సంస్కరణలు అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. గ్రీన్ కార్డు హోల్డర్ల కుటుంబాలను విడదీయడం అన్యాయం. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌ను వెంటనే తొలగించి కుటుంబ ఆధారిత వీసాల జారీని వేగవంతం చేసేలా వ్యవస్థను సంస్కరిస్తాం. కుటుంబసభ్యులను విడదీసి, దూరంగా ఉంచేలా ప్రస్తుతం అమలులో ఉన్న పదేళ్ల వెయిటింగ్ సమయాన్ని తొలగిస్తాము. దీంతో పాటు ఇతర ఇమ్మిగ్రేషన్ అడ్డంకులను తొలగించడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాము. ముస్లిం, అరబ్, ఆఫ్రికన్ దేశాలపై వివక్ష చూపుతూ విధించిన ఇమ్మిగ్రేషన్ ఆంక్షలను కూడా డెమొక్రటిక్ పార్టీ ఎత్తివేస్తుంది. భవిష్యత్తులో మరే అధ్యక్షుడు ఈ విధంగా వివక్షతో నిషేధాలు విధించరని నమ్మకం కలిగించేలా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాము’ అని చెప్పింది. కాగా.. విస్కాన్సిన్‌లో ఆగస్ట్ 17 నుంచి 20 వరకు జరిగే జాతీయ సదస్సులో ఈ 2020 డెముక్రటిక్ పార్టీ ప్లాట్‌ఫామ్‌ను ప్రతినిధులు స్వీకరిస్తారు. ఇదే సమావేశంలో మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ను డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకుంటారు. ఇక నవంబర్ మూడో తేదీన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు జరగునున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుం

Updated Date - 2020-08-06T02:31:40+05:30 IST