ముంపు సమస్య పరిష్కారమయ్యేనా?

ABN , First Publish Date - 2022-09-20T03:42:11+05:30 IST

గోదావరి పరివాహక ప్రాం త ముంపు గ్రామాల్లో అధ్యయనానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసింది. వరద ప్రభావంపై అధ్యయనం చేయడం ద్వారా భద్రాచలంతోపాటు ఇతర ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. గోదావరి ప్రవాహంపై సమగ్ర సర్వేతో పాటు నీటి ప్రవాహం, బ్యాక్‌ వాటర్‌ ప్రభావం, తదితర అంశాలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ నివేదిక సమర్పించాలని ఈ నెల 13న ఆదేశించారు

ముంపు సమస్య పరిష్కారమయ్యేనా?
చెన్నూర్‌ మండలంలో నీట మునిగిన పంట పొలాలు (ఫైల్‌)

గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధ్యయనానికి ఆదేశం 

నిపుణుల కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం  

రెండు వారాలలోపు నివేదిక అందజేసేలా ఉత్తర్వులు జారీ  

జిల్లాలో వరదలతో భారీ నష్టం 

మంచిర్యాల, సెప్టెంబరు  19 (ఆంధ్రజ్యోతి): గోదావరి పరివాహక ప్రాం త ముంపు గ్రామాల్లో అధ్యయనానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిపుణుల  కమిటీలను ఏర్పాటు చేసింది. వరద ప్రభావంపై అధ్యయనం చేయడం ద్వారా భద్రాచలంతోపాటు ఇతర ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. గోదావరి ప్రవాహంపై సమగ్ర  సర్వేతో పాటు నీటి ప్రవాహం, బ్యాక్‌ వాటర్‌ ప్రభావం, తదితర అంశాలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ నివేదిక సమర్పించాలని ఈ నెల 13న ఆదేశించారు. అధ్యయనం పూర్తి చేసి ఈ నెల 26లోగా సంబంధిత ప్రణాళికతో నివేదిక అందజేయాలని కమిటీకి సూచించారు. కమిటీ సమ ర్పించే నివేధిక ఆధారంగా భవిష్యత్‌ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు, ఆస్తుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నివేదికను పరిశీలించి తదుపరి కార్యాచరణను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. 

రెండు వారాల గడువుతో సాధ్యమయ్యేనా?

గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధ్యయనం చేయడానికి  కమిటీని ఏర్పా టు చేసిన నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అందుకు గరిష్టంగా రెండు వారాల గడువు విధించారు. ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేసి  26 లోపు నివేదిక అందజేయాలని సూచించడంతో సర్వత్రా అయోమయ పరిస్థి తులు నెలకొన్నాయి. ప్రస్తుతం గోదావరికి భారీగా వరద కొనసాగుతున్నం దున రెండు వారాల్లో అధ్యయనం పూర్తి చేయడం వీలవుతుందా అనేది సందేహంగా మారింది. భద్రాచలం మొదలుకొని మంచిర్యాల జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం దాదాపుగా నీట మునగడంతో ప్రజలకు పెద్ద మొత్తంలో ఆస్తి, పంట నష్టం సంభవించింది. ఈ క్రమంలో ప్రతీ ముంపు ప్రాంతంపై అధయనం చేస్తే తప్ప పూర్తి స్థాయిలో నష్టం అంచనా తేలే పరి స్ధితి లేదు. కేవలం రెండు వారాలు గడువు విధించడం ద్వారా తూతూ మంత్రంగా అధ్యయనం చేసి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు జరుగు తున్నట్లు సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

జిల్లాలో భారీ నష్టం 

జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగి ప్రజలు, రైతులకు తీరని నష్టం వాటిల్లింది. 30 సంవత్సరాలలో సంభవించని వరదలు ముంచెత్తడంతో జనజీవనం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రమైన మంచి ర్యాలతోపాటు నస్పూర్‌ మున్సిపాలిటీ, హాజీపూర్‌, జన్నారం మండలాల్లో ముంపు ప్రభావం చాలా అధికంగా ఉంది. ఒక్క జిల్లా కేంద్రంలోనే 750 పైచిలుకు ఇండ్లు నీట మునగగా లక్షల విలువైన గృహోపకరణలు, ఇతర  సామగ్రి తడిసి ముద్దయ్యాయి. కోటపల్లి, చెన్నూర్‌ మండలాల్లో వేలాది ఎక రాల్లో పంట నష్టం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌నగర్‌, ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్‌, పద్మశాలికాలనీ, రెడ్డి కాలనీ, ఇందిరానగర్‌, నస్పూర్‌ మున్సి పాలిటీ పరిధిలోని వినూత్న కాలనీ, హాజీపూర్‌ మండలంలోని వేంపల్లి గ్రా మం పూర్తిగా నీట మునిగాయి. జన్నారం మండలంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు నీట మునిగాయి. ఈ ముంపు ప్రాంతాలను పూర్తిగా పరిశీలించడానికి  కనీసం పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. వీటితోపాటు జిల్లాలో సుమారు 2500 ఎకరాల్లో పంట  నష్టం జరగగా రైతులకు కోట్లలో నష్టం జరిగింది. పంట నష్టం అంచనాపై సర్వే చేసిన అధికారులు నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు. అయితే 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాధిత రైతులను ఆదుకునే దిశగా ప్రభు త్వం కృషి చేయలేదు. అలాగే ముంపు కాలనీల బాధితులకు తక్షణ సహా యం కింద ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు జిల్లా ప్రజలకు అందిన దాఖలాలు లేవు. గోదావరి ముంపుపై అధ్యయనం పేరుతో నిపుణుల కమి టీని వేసి ప్రభుత్వం కాలయాపన చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

మిగిలింది ఆరు రోజులే 

గోదావరి ముంపుపై అద్యాయనం చేసేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. ఈ కమిటీ ముంపు ప్రాంతాల్లో ఎక్కడ పర్యటిస్తుందో కాని జిల్లాలో అడుగు పెట్టలేదు. ప్రభుత్వం ప్రకటించి రెండు వారాల్లో వారం గడిచిపోగా మిగిలిన వారం రోజుల్లో అధ్యయనం ఎలా చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిర్ణీత గడువు ఈనెల  26లోగా కమిటీ అధ్యయనం పూర్తి చేసి నివేదిను సమర్పించాలి. అయితే జిల్లాలో ఎక్కడ కూడా ముంపు ప్రాంతాల్లో ఈ కమిటీ అధ్యయనం ప్రారంభించకపోగా నివేదికలు ఎప్పుడు తయారు చేస్తారు, ఎప్పుడు సమర్పి స్తారనే సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే  నిర్ణీత గడువుతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో సర్వే జరిపి బాధితులందరికి మేలు చేకూర్చాలని ప్రజలు కోరుతున్నారు.    

Updated Date - 2022-09-20T03:42:11+05:30 IST