కోవిడ్ టీకా పేటెంటు ఎత్తివేత జరగనుందా ?

ABN , First Publish Date - 2021-05-06T21:11:06+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ ఎదుర్కొనే క్రమంలో... వేయించుకునే టీకాల ధర పెరగడానికి పేటెంటు ఫీజులు ముఖ్య కారణమన్న విషయం తెలిసిందే.

కోవిడ్ టీకా పేటెంటు ఎత్తివేత జరగనుందా ?

న్యూయార్క్ : ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ ఎదుర్కొనే క్రమంలో... వేయించుకునే టీకాల ధర పెరగడానికి పేటెంటు ఫీజులు ముఖ్య కారణమన్న విషయం తెలిసిందే. అయితే కరోనా సంక్షోభం దృష్ట్యా ఈ ఫీజుల నుంచి మినహాయింపునివ్వాలని అమెరికాకు అమెరికాకు దక్షిణాఫ్రికా,   భారత్‌లు విజ్ఞప్తి చేశాయి.  అయితే కోవిడ్‌ టీకా పేటెంట్ ఫీజుల మినహాయింపుపై చేస్తోన్న పోరాటంలో భారత్‌కు అత్యంత కీలక భాగస్వామి నుంచి మద్దతు లభించడం విశేషం. కరోనా టీకాకు పేటెంట్ల నుంచి మినహాయింపునివ్వాలన్న వాదనకు  అమెరికా మద్దతు పలికింది. పేద దేశాల ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమైన టీకాల లభ్యత పెంపుపై ఈ అంశం ఆశలు పెంచింది.


కాగా... ఈ విషయమై  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కాగా...  మేధో హక్కులపై మినహాయింపులనివ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఒత్తిడి ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి... టీకాలపై సంపన్న దేశాలు గుత్తాధిపత్యం చూపుతున్నాయన్న విమర్శలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘మినహాయింపులు’ దిశగా బైడెన్‌ కార్యవర్గం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-05-06T21:11:06+05:30 IST