ప్రశ్నిస్తే రేట్లు పెంచుతారా..?

ABN , First Publish Date - 2021-10-18T05:16:22+05:30 IST

ఎగ్జిబిషన్‌లో నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తుండడం దారుణమని ప్రశ్నిస్తే వాటి కంటే ఎక్కువ రేట్లు పెంచడం ఏమిటని టీడీ పీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే రేట్లు పెంచుతారా..?
సమావేశంలో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 17 : ఎగ్జిబిషన్‌లో నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తుండడం దారుణమని ప్రశ్నిస్తే వాటి కంటే ఎక్కువ రేట్లు పెంచడం ఏమిటని టీడీ పీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టీబీ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో  విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌, పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డిలతో కలిసి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలు అన్నింటా దోపిడీకి ఎగబడుతున్నారని ధ్వజ మెత్తారు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని త్వరలో  వైసీపీకి ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని వారన్నారు. ఎగ్జిబిషన్‌లో ప్రవేశరుసుము దోపిడీపై అధికారులకు వాట్సప్‌ ద్వారా తెలియజేసినా స్పందన లేదన్నారు. 

 వీఎస్‌ ముక్తియార్‌కు సన్మానం

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వీఎస్‌ ముక్తియార్‌ నియమితులైన సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు దుశ్శాలువతో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మానగ్రహిత వీఎస్‌ ముక్తియార్‌ మాట్లాడుతూ 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. సన్మానించిన వారిలో టీడీపీ నేతలు  ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, సానా విజయభాస్కర్‌రెడ్డి, సిద్దయ్య, తెలుగురైతు నాయకుడు కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్‌, తెలుగుయువత నాయకుడు  నాగరాజు ఉన్నారు. 

నందమూరి యువసేవా సమితి ఆధ్వర్యంలో : టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వీఎస్‌ ముక్తియార్‌ నియమితులైన సందర్భంగా నందమూరి యువసేవా సమితి వారు ఆయనను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.  కార్యక్రమంలో గోమేధికం సుదర్శన్‌, సీజే వెంకటసుబ్బయ్య, సుంకర వేణుగోపాల్‌, సురేష్‌, కుల్లాయప్ప, గురుప్రసాద్‌, రాజేస్‌, వ్యానేష్‌, మంజునాధ  పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:16:22+05:30 IST