May 8 2021 @ 12:43PM

'తిమ్మరుసు' ఓటీటీలో రానుందా..?

యువ నటుడు సత్యదేవ్ నటిస్తున్న 'తిమ్మరుసు' ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేక థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అన్న టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శరణ్ కొప్పిశెట్టి  రూపొందిస్తున్న ఈ సినిమాలో టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌లకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మే 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తిమ్మరుసు కూడా రిలీజ్ పోస్ట్  పోన్ చేయనున్నారని తెలుస్తోంది. ఆయితే సత్యదేవ్ ఇంతక ముందు నటించిన  '47 డేస్', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', 'గువ్వ గోరింక' సినిమాలు ఓటీటీలో విడుదలై ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు తిమ్మరుసు కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. చూడాలి మరి 'తిమ్మరుసు' ఓటీటీలో రానుందా లేక థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వేచి చూస్తారా.