Abn logo
Oct 15 2021 @ 00:37AM

ప్రజల కోసం పనిచేస్తా: వీరేశం

రామన్నపేట, అక్టోబరు 14: చివరి రక్తం బొట్టు వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ కోసం,  ప్రజల కోసం పనిచేస్తానని ఉద్దీపన సంస్థ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని తుమ్మలగూడెంలో గంగపుత్ర సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకుడు పూస బాలకిషన్‌ జన్మదినం వేడుకల్లో వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం పని చేస్తానని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవడమే తన ధ్యేయమన్నారు. ఈ కార్యక్ర మంలో బీసీ కార్పొరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పూసర్ల శంబయ్య, గంగుల వెంకటరాజిరెడి బాలమణి, బాలనర్సయ్య పాల్గొన్నారు.