నా ట్రాక్టర్‌నే ఆపుతారా..?

ABN , First Publish Date - 2022-01-24T06:07:19+05:30 IST

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వైసీపీ నేత ట్రాక్టర్‌ను పట్టుకున్న స్పెషల్‌ ఎ న్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులకు చేదు అ నుభవం ఎదురయ్యింది. ఇసుక లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్‌ అడ్డుకున్న వారు ఆ గ్రామ స్థాయి నేత షాక్‌ ఇచ్చాడు. ‘‘నేను నాయకుడిని. నా ట్రాక్టర్‌నే ఆపుతారా..’’ అంటూ వా గ్వివాదానికి దిగారు. తన అనుచరులతో నానా యాగీ చేశాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది.

నా ట్రాక్టర్‌నే ఆపుతారా..?
ఇసుక ట్రాక్టర్‌కు అడ్డంగా ఉన్న వైసీపీ నాయకుడి అనుచరులు

 ఎస్‌ఈబీ అధికారులతో వైసీపీ నాయకుడి వాగ్వివాదం

 ట్రాక్టర్‌ కదిలించకుండా అడ్డుకున్న నేత అనుచరులు

 పోలీసుల రంగప్రవేశం

 ట్రాక్టర్‌ను వదిలేసి పోయిన వైనం

 పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సీఐ 


ఒంగోలు నగరం, జనవరి 23: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వైసీపీ నేత ట్రాక్టర్‌ను  పట్టుకున్న స్పెషల్‌ ఎ న్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులకు చేదు అ నుభవం ఎదురయ్యింది. ఇసుక లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్‌ అడ్డుకున్న వారు ఆ గ్రామ స్థాయి నేత షాక్‌ ఇచ్చాడు. ‘‘నేను నాయకుడిని. నా ట్రాక్టర్‌నే ఆపుతారా..’’ అంటూ వా గ్వివాదానికి దిగారు. తన అనుచరులతో నానా యాగీ చేశాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది.

 ఎస్‌ఈబీ సీఐ లత తన సిబ్బందితో కొత్తపట్నం మం డలంలోని మడనూరు గ్రామంలో అక్రమంగా ఇసుకును తరలిస్తున్న ట్రాక్టర్‌లను పట్టుకునేందుకు వెళ్ళారు. అను మతి లేని ఇసుక క్వారీని తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను గుర్తిం చి ఆపారు. ట్రాక్టర్‌ను తానే స్వయంగా నడుపుతున్న నేత అధికారులపై ఫైర్‌ అయ్యాడు. తన అనుచరులకు సమా చారం పంపించాడు. గ్రామంలోని ఆ నేత అనుచరులు ఎక్కువ సంఖ్యలో చేరి కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను తీ సుకుని వెళితే చూస్తూ ఊరుకునేది లేదంటూ పట్టు పట్టారు.  ఎస్‌ఈబీఅధికారులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసు కుని తీసుకుపోకుండా వాహనం ముందు అడ్డంగా పడు కున్నారు. గ్రామంలో చిన్నచిన్న అవసరాల కోసం ఇసుకు ను తీసుకుపోతుంటే ఎలా అడ్డుకుంటారంటూ  ఎస్‌ఈబీ సీఐ లతను ప్రశ్నించారు. దీంతో ఉదయం 11 గంటల స మయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ రగడ కొనసాగు తూనే ఉంది. అధికారుల విధులకు ఆటకం కలిగించవద్దం టూ చెబుతున్నా నాయకుడు, అతని అనుచరులు ససే మిరా వినలేదు. దీంతో   ఎస్‌ఈబీ అధికారులు స్థానిక పో లీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఒంగోలు టూ టౌన్‌ సీఐ రాఘవరావు మడనూరు వచ్చారు. ట్రాక్టర్‌ య జమాని అయిన వైసీపీ నాయకుడు, అతని అనుచరునితో మాట్లాడారు. ఎస్‌ఈబీ అధికారులను అడ్డుకోవద్దంటూ వి జ్ఞప్తి చేశారు. అయినా పట్టువదలలేదు.  ఎస్‌ఈబీ అధికా రులపై ఆరోపణలు చేస్తూ దారికి అడ్డంగానే బైఠా యించారు. దీంతో సాయంత్రం కల్లా ఒంగోలు డీఎస్పీ నాగరాజు గ్రామానికి చేరుకున్నారు. వైసీపీ నాయకుడితో మాట్లాడారు.  ఎస్‌ ఈబీ పోలీసులు కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను అక్కడ నుంచి తర లించేందుకు అప్పుడు కూడా ఒ ప్పుకోలేదు. నాయకుడి అనుచరు లు మాత్రం హల్‌చల్‌ చేశారు.  మా ట్రాక్టర్లు పట్టుకుంటే విడిపించే మా నాయకుడి బండే పట్టుకుంటే ఊరుకోమం టూ తేల్చిచెప్పారు. గ్రామ నాయకుడికి అండగా అతని అ నుచరులు మోహరించటం,  ఎస్‌ఈబీ సిబ్బంది తక్కువ గా ఉండటంతో ఏమీ చేయలేని స్థితిలో నిలబడి పోయా రు.  లంచాలు ఇచ్చే వారి ట్రాక్టర్లను పట్టుకోకుండా మా ట్రాక్టర్లను పట్టుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పిం చారు. కాగా వైసీపీ గ్రామ నాయకులు గ్రామంలో నిర్మిం చే పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను చేస్తు న్నట్లుగా సమాచారం. ఇసుక క్వారీల ద్వారా రోజు వారీ ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకుని తరలిస్తున్నట్లుగా  సమాచారం అందటంతోనే దాడులు చేసేందుకు వచ్చిన ట్లు  ఎస్‌ఈబీఅధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రజాప్రతినిఽధి కూడా ట్రాక్టర్‌ను వదిలేయ్యాలంటూ  ఎ స్‌ఈబీ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిథి కుమారుడు కూడా పలుమార్లు వారితో మాట్లాడినట్లు వార్తలు వినిపించాయి.  ట్రాక్టర్‌పై  కేసు పెట్టకుండా వదిలేయ్యాలంటూ  చెప్పి నా  సీఐ లత మా త్రం ఎవరి మాట వినేదే లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా సాయంత్రానికి కల్లా ట్రాక్ట ర్‌లోని ఇసుకుని కింద పారబోశారు. ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి పోలీసులు వెళ్లిపోయారు. తన విధులకు ఆటకం కలిగించారంటూ ఫిర్యాదు చేసేందుకు ఎస్‌ఈబీ సీఐ లత కొత్తపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళారు. కాగా కొత్తపట్నం పోలీసుస్టేషన్‌లోనే ఆమె రాత్రి 8 గంట ల వరకు ఉన్నారు.


Updated Date - 2022-01-24T06:07:19+05:30 IST