తొలగిస్తారు.. నియమిస్తారు

ABN , First Publish Date - 2020-05-21T10:10:30+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడాలేని విచిత్ర పరిస్థితి ఖమ్మం నగరపాలక సంస్థలో నెలకొంది. ఔట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల విషయంలో ఇష్టారాజ్యంగా

తొలగిస్తారు.. నియమిస్తారు

నగరపాలక సంస్థలో విచిత్ర పరిస్థితి

పారిశుధ్య కార్మికల విషయంలో ఇష్టారాజ్యం

సిండికేట్‌గా ఏర్పడి బడుగుల జీవితాలతో ఆటలు


ఖమ్మం కార్పొరేషన్‌, మే20: రాష్ట్రంలో ఎక్కడాలేని విచిత్ర పరిస్థితి ఖమ్మం నగరపాలక సంస్థలో నెలకొంది. ఔట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల విషయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలకు ఇటీవల  సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారో... ఎవరిని నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. విధులకు హాజరైనా, గైర్హాజర్‌ అయినట్లు చూపటం, ఎవరికి తెలియకుండా ఒకఉద్యోగిస్థానంలో మరొకరిని నియమించటం చేస్తున్నారు. చివరకు తమపేరు తొలగించి నట్లు తెలిసిన తరువాత ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినా లాభం లేకపోతున్నది. కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి, కొందరి పెద్దల సహకారంతో దందా కొనసాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి ఉన్నప్పటికీ, ఆయనకు తెలియకుండా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించటం చర్చకు దారితీస్తోంది. బాధితులు కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లినా, ఆయనను తప్పుదారి పట్టిస్తూ తమపని చేసుకుపోతున్నారు.


పధకం ప్రకారమే 

ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా, కరోనా వ్యాప్తిలోనైనా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులను అకా రణంగా తొలగిస్తూ వారి కుటుంబాలు వీధిన పడేలా చేస్తూ ఉసురు పోసుకుంటున్నారు. పధకం ప్రకారమే కొంతమందిని తొలగించి, తమకు ఇష్టమైన వారిని నియమిస్తున్నారు. 27వ డవిజన్‌లో 13ఏళ్లుగా పనిచేస్తున్న కోండ్రు ఉపేంద్రమ్మ  మహిళాకార్మికురాలి విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఆమె విఽధులకు గైర్హాజరు అవుతున్నట్లు హాజరుపట్టీలో చూపించారు. వాస్తవంగా ఆమె విధులకు వస్తున్పప్పటికీ ఆబ్‌సెంట్‌ వేశారు. నిబంఽధనలకు విరుద్ధంగా పారిశుధ్య జవాన్‌కు తెలియకుండా ఆమెను తొలగించారు. అదే ఐడీ నెంబర్‌పై వేరొక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. కాగా ఉపేంద్రమ్మ సరిగా విఽధులకు హాజరుకావటం లేదని, డివిజన్‌ కార్పొరేటర్‌ ఫిర్యాదు మేరకు ఆమెను తొలగించామని చెబుతున్నారు. అయితే సదరు కార్పొరేటర్‌ భర్త నగరపాలక సంస్థలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నా.. విధులకు హాజరు కావటంలేదని, అప్పటి కమిషనర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కార్పొరేటర్‌ కుమారుడు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నా ఎవరికి కనబడడు. వీరిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నలు వస్తున్నాయి.


తాజాగా మరికొన్ని ఘటన

పెద్దతండాలో ఒక పారిశుధ్య కార్మికుడు విధులకు హాజర వుతున్నా... అతడిని గైర్హాజర్‌గా చూపిస్తూ, మరొకరిని నియమించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విఽధులకు హాజరుఅవుతున్నా, వేతనం రాకపోవటంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. సదరు కార్మికుడు కమిషనర్‌ అనురాగ్‌ జయంతి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లినట్లు తెలిసింది. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు వాస్తవంగా విఽధులకు గైర్హాజర్‌ అయితే వేతనంలో కోత విధిస్తారు. కార్మికులను పర్యవేక్షించే ఏజెన్సీ కాలపరిమితి ముగిసిన తరువాతే చర్యలు తీసుకోవాలి. దీనికి విరుద్ధంగా కార్మికులను ఎవరికీ తెలియకుండా తొలగించి, ఇష్టం వచ్చినవారిని నియమిం చుకునే సాంప్రదాయం ఒక్క ఖమ్మం నగరపాలక సంస్థలోనే ఉండటం గమనార్హం. దీనిపై పూర్తి విచారణ నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-21T10:10:30+05:30 IST