Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అవుటైన రసెల్

షార్జా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 62 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్ మెహది హసన్.. క్రిస్ గేల్ (4), హెట్‌మెయిర్ (9) వికెట్లను పడగొట్టి విండీస్‌ను భయపెట్టగా, ఎవిన్ లూయిస్ (2)ను ముస్తాఫిజుర్ వెనక్కి పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కీరన్ పొలార్డ్.. క్రీజులో నిలదొక్కుకున్న రోస్టన్ చేజ్‌తో కలిసి నిదానంగా ఆడుతూ పరుగులు పెంచే ప్రయత్నం చేశాడు.


ఈ క్రమంలో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పొలార్డ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రసెల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిశాయి. విండీస్ నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ 29 పూరన్ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Advertisement
Advertisement