విండోస్‌ 11 వచ్చేస్తోందోచ్‌..

ABN , First Publish Date - 2021-06-25T05:59:11+05:30 IST

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎ్‌స)ను ఆవిష్కరించింది. సరికొత్త

విండోస్‌ 11 వచ్చేస్తోందోచ్‌..

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎ్‌స)ను ఆవిష్కరించింది. సరికొత్త యూజర్‌ ఇంటర్‌ఫే్‌స హంగులు, గత తరం ఓఎ స్‌తో పోలిస్తే డిజైన్‌లో చిన్నపాటి మార్పులతో దీన్ని రూపొందించింది. 2015లో విండోస్‌ 10ను  విడుదల చేసి న కంపెనీ.. ఆరేళ్ల తర్వాత సరికొత్త తరం ఓఎ్‌సతో  ముం దుకొచ్చింది. అంతేకాదు, తెలుగువ్యక్తి సత్య నాదెళ్ల సారథ్యంలో మైక్రోసాఫ్ట్‌ విడుదల చేయనున్న కొత్త తరం విండోస్‌ ఓఎస్‌ ఇదే.


నిర్దిష్ట తేదీని ప్రకటించకపోయినప్పటికీ, ఈ ఏడాది చివరికల్లా కొత్త విండోస్‌ ఓఎస్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అంతేకాదు, విండోస్‌ 10 వినియోగదారులు ఉచితంగా కొత్త ఓఎ్‌సకు అప్‌డేట్‌ అయ్యే కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. లైవ్‌ టైల్స్‌తో కూడిన విండోస్‌ 11 స్టార్ట్‌ మెన్యూ ఐకాన్స్‌ స్ర్కీన్‌ అడుగున మధ్యలో దర్శనమిస్తాయి. విండోస్‌ 11లో యాప్‌ స్టోర్‌.. ఆండ్రాయిడ్‌ యాప్స్‌కూ సపోర్ట్‌ చేస్తుంది. 

Updated Date - 2021-06-25T05:59:11+05:30 IST