Abn logo
Aug 14 2020 @ 21:33PM

70కిమీల వేగంతో గాలి.. పైకి పారిన జలపాతం!

సిడ్నీ: విపరీతమైన గాలి, వర్షం ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఈ క్రమంలో నగరంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. స్థానికంగా ఉన్న రెండు జలపాతాలు వెనుతిరిగి పైకి పారాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ఇలాంటి అద్భుతాన్ని మునుపెన్నడూ చూడలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాయల్ నేషనల్ పార్క్‌లోని ఓ కొండ చెరియ వద్ద ఈ వీడియో తీసినట్లు సమాచారం.

Advertisement
Advertisement