మద్యం దుకాణాలు మూసే ఉంటాయి

ABN , First Publish Date - 2020-03-29T19:38:39+05:30 IST

ప్రభుత్వం తదుపరి ప్రకటన వరకూ రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.

మద్యం దుకాణాలు మూసే ఉంటాయి

హైదరాబాద్‌: ప్రభుత్వం తదుపరి ప్రకటన వరకూ రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. మార్చి 29 నుంచి మద్యం దుకాణాలను మధ్యామ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకూ తెరిచి ఉంచుతారంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో ప్రచారంలో ఉన్న ఆర్డర్‌ ఫేక్‌ ఆర్డర్‌గా అధికారులు తెలిపారు. కరోనావ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ లాక్‌డౌన్‌లో భాగంగానే మద్యం దుకాణాలు మూసి వేశామని అన్నారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకూ దుకాణాలు మూసే ఉంటాయన్నారు. సోషల్‌మీడియాలో ఇలాంటి ప్రచారం నిర్వహిస్తున్న వ్యక్తిపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ అధికారులు కేసు చే సినట్టు తెలిపారు. 

Updated Date - 2020-03-29T19:38:39+05:30 IST