Abn logo
Mar 24 2021 @ 17:14PM

వైన్స్‌, బార్లు, థియేటర్లు, పార్క్‌లు మూసివేయాలి: జగ్గారెడ్డి

హైదరాబాద్: వైన్స్‌, బార్లు, థియేటర్లు, పార్క్‌లు మూసివేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వమే ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు ఉండరా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులో సగం అయినా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూల్‌ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలని జగ్గారెడ్డి కోరారు.


విద్యా సంస్థలు మళ్లీ మూతబడ్డాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శాసనసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. వైద్య కళాశాలలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.