జాతీయస్థాయి జి.కె పోటీల్లో విజేత

ABN , First Publish Date - 2021-04-03T05:32:48+05:30 IST

జనరల్‌ నాలెడ్జ్‌కున్న ప్రాధాన్యతను పిల్లలను తెలియజెప్పడం కోసం జి.కె పోటీలను నిర్వహిస్తుంటారు. అలా

జాతీయస్థాయి జి.కె పోటీల్లో విజేత

జనరల్‌ నాలెడ్జ్‌కున్న ప్రాధాన్యతను పిల్లలను తెలియజెప్పడం కోసం  జి.కె పోటీలను నిర్వహిస్తుంటారు. అలా నిర్వహించిన జాతీయస్థాయి జి.కె ఒలింపియాడ్‌ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ బన్సల్‌ విజేతగా నిలిచాడు. 


కార్తికేయ హైదరాబాద్‌లోకి చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. మైండ్‌ వార్స్‌ మొబైల్‌ అప్లికేషన్‌ సహాయంతో విద్యార్థులు జి.కె టెస్టులకు హాజరయ్యారు.


‘‘నేషనల్‌ చాంపియన్‌షి్‌ప గెలవడం ఆనందంగా ఉంది. పరీక్ష చాలా ఆసక్తిగా ఉంది. ఈ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యే సమయంలో ఎంతో నేర్చుకున్నాను. ప్రాక్టీస్‌ పేపర్లు, మాక్‌టెస్టులు, రకరకాల జి.కె పుస్తకాలు చదవడం వల్ల విజేతగా నిలవగలిగాను’’ అని తన ఆనందాన్ని పంచుకున్నారు కార్తికేయ.


ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతితోపాటు మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేశారు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం, జీవితంలో ప్రతి సందర్భంలోనూ సరైన ప్రదర్శన చేయడం వంటి వాటిని పిల్లల్లో పెంపొందించేలా మైండ్‌ వార్స్‌ ఒలింపియాడ్‌ యాప్‌ను డిజైన్‌ చేశారు. ఈ యాప్‌లోనే విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు.


Updated Date - 2021-04-03T05:32:48+05:30 IST