Abn logo
Sep 22 2021 @ 03:53AM

పంకజ్‌ ఖాతాలో మరో వరల్డ్‌ టైటిల్‌

దోహా: భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ ఆడ్వాణీ.. ఐబీఎస్‌ఎఫ్‌ 6- రెడ్‌ స్నూకర్‌ వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 24వ వరల్డ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మం గళవారం జరిగిన పైనల్లో పాకిస్థాన్‌ ప్లేయర్‌ బాబర్‌ మాసిపై పంకజ్‌ 43-13తో ఘన విజయం సాధించాడు. గతవారమే పంకజ్‌ ఆసియా స్నూకర్‌ టైటిల్‌ కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.