Wipro: 3 ట్రిలియన్లను దాటిన మార్కెట్ క్యాపిటలైజేషన్!

ABN , First Publish Date - 2021-06-03T21:54:55+05:30 IST

భారత దిగ్గజ ఐటీ సంస్థ విప్రో గురువారం మరో అరుదైన ఘనత సాధించింది.

Wipro: 3 ట్రిలియన్లను దాటిన మార్కెట్ క్యాపిటలైజేషన్!

భారత దిగ్గజ ఐటీ సంస్థ విప్రో గురువారం మరో అరుదైన ఘనత సాధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ.3 ట్రిలియన్లను (రూ.3 లక్షల కోట్లు) తాకింది. టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), ఇన్ఫోసిస్ తర్వాత ఈ మైలురాయిని సాధించిన భారత మూడో ఐటీ సంస్థగా విప్రో నిలిచింది. ఈ రోజు (గురువారం) ట్రేడింగ్ ప్రారంభ సమయంలో విప్రో షేరు రూ.550 తాకింది. దీంతో విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.01 ట్రిలియన్లను చేరింది.


గురువారం ట్రేడింగ్ ముగిసే సరికి విప్రో షేరు రూ.539 వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 ట్రిలియన్ల కంటే తగ్గింది. కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశం మొత్తంలో విప్రో 14వ స్థానంలో ఉంది. రూ.14.05 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్, రూ.11.58 మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో టీసీఎస్, రూ.8.33 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారతదేశంలో అత్యంత విలువైన సంస్థలుగా ఉన్నాయి.


Updated Date - 2021-06-03T21:54:55+05:30 IST