ట్రాన్సఫార్మర్‌ను చుట్టుకున్న తీగలు

ABN , First Publish Date - 2021-10-18T06:01:13+05:30 IST

మండలంలోని కందుకూరులో కొత్త శివాలయానికి వెళ్లేదారిలోనిది ఈ చిత్రం. విద్యుత శాఖాధి కారులకు కనిపించకపోవడం ఓ విచిత్రం.

ట్రాన్సఫార్మర్‌ను చుట్టుకున్న తీగలు
ట్రాన్సఫార్మర్‌కు దట్టంగా అల్లుకున్న పూలతీగలు

అనంతపురంరూరల్‌, అక్టోబరు17: మండలంలోని కందుకూరులో కొత్త శివాలయానికి వెళ్లేదారిలోనిది ఈ చిత్రం. విద్యుత శాఖాధి కారులకు కనిపించకపోవడం ఓ విచిత్రం. వారి నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం. స్థానికంగా ఉన్న ట్రాన్సఫార్మర్‌కు ఇరువైపులా, స్టే  వైరుకు  చెట్టు తీగలుదట్టంగా అల్లుకున్నాయి. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉన్నా... అంతకన్నా  ఎక్కు వ ప్రమాదం అందులో పొంచి ఉంది.  ఆ పూల తీగల్లోని ఏవైనా విద్యుత తీగలు తెగిపోయినా కనిపించదు. స్థానికులు రాకపోకలు సా గించే దారి అది. అలాంటి పరిస్థితుల్లో జరగరానిది ఏమైనా జరిగే అవకాశం లేకపోలేదు. సాఽ దారణంగా విద్యుత అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ, స్థానికంగా ఉన్న సమస్యలను గు ర్తించి పరిష్కరించాల్సి ఉంది. అలాగే తరచూ విద్యుత అధికారులు మె యింటెనెన్స పేరుతో గంటల తరబడి విద్యుత సరఫరా నిలిపివేస్తుంటారు. గాలులకు చెట్ల కొమ్మలు విద్యుత తీగలకు తగిలి విద్యుత సరఫరాలో అంతరాయాలు ఏర్పడుకుండా తొలగిస్తుంటారు. అయితే మండలంలోని విద్యుత అధికారులకు ఈ చిత్రం కనిపించకపోవడం విచిత్రంగా ఉంది.


Updated Date - 2021-10-18T06:01:13+05:30 IST