భారత్‌లోనూ వైరోష్యూర్‌-19 కరోనా పరీక్షలు!

ABN , First Publish Date - 2020-07-10T07:38:19+05:30 IST

అత్యంత కచ్చితత్వంతో, వేగంగా కరోనా వైరస్‌ ఉనికిని పసిగట్టే ఆర్‌టీ-పీసీఆర్‌ ఆధారిత పరీక్షల్ని(వైరోష్యూర్‌) భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూరోఫిన్స్‌ క్లినికల్‌ జెనిటిక్స్‌ సంస్థ ప్రకటించింది...

భారత్‌లోనూ వైరోష్యూర్‌-19 కరోనా పరీక్షలు!

బెంగళూరు, జూలై 9: అత్యంత కచ్చితత్వంతో, వేగంగా కరోనా వైరస్‌ ఉనికిని పసిగట్టే ఆర్‌టీ-పీసీఆర్‌ ఆధారిత పరీక్షల్ని(వైరోష్యూర్‌) భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూరోఫిన్స్‌ క్లినికల్‌ జెనిటిక్స్‌ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు, ఐసీఎంఆర్‌ ఆమోదం లభించాయని తెలిపింది.


బెంగళూరులోని పీన్యాలో ఉన్న తమ శాఖ, కరోనా పరీక్షలకే అంకితం కానుందని స్పష్టం చేసింది. ఈ పరీక్ష ద్వారా వేగంగా కరోనా నిర్ధారణ కావడంతో.. రోగిని రక్షించేందుకు అమూల్యమైన సమయం ఆదా అవుతుందని వివరించింది. మూడు నెలల పాటు, నిపుణులతో, పలు సంస్థలకు చెందిన పరిశోధకుల బృందం తీవ్రంగా శ్రమించి ఈ పరీక్షను రూపొందించినట్లు పేర్కొంది. తమ సంస్థకు ప్రస్తుతం 50 దేశాల్లో 800 పరీక్షాకేంద్రాలు ఉన్నాయని యూరోఫిన్స్‌ వెల్లడించింది.


Updated Date - 2020-07-10T07:38:19+05:30 IST