పాపాల్ని కడిగే జ్ఞానదార!

ABN , First Publish Date - 2020-12-04T05:32:31+05:30 IST

‘అనేక రకాల పాపాలు చేసి భయపడుతున్న వారికి నేనున్నాను’ అంటూ ఓదార్పును ఇస్తున్నాడు శ్రీకృష్ణపరమాత్మ. భగవద్గీత నాలుగో అధ్యాయం 36వ శ్లోకంలో ఈ విషయాన్ని వివరించాడు.

పాపాల్ని కడిగే జ్ఞానదార!

‘అనేక రకాల పాపాలు చేసి భయపడుతున్న వారికి నేనున్నాను’ అంటూ ఓదార్పును ఇస్తున్నాడు శ్రీకృష్ణపరమాత్మ. భగవద్గీత నాలుగో అధ్యాయం 36వ శ్లోకంలో ఈ విషయాన్ని వివరించాడు.


అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః 

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి


‘‘అర్జునా! చిన్నచిన్న పొరపాట్లు చేయడం, తప్పులు చేయడం కాదు. నేరాలు, ఘోరాలు చేసినా సరే, జ్ఞాన మార్గం ద్వారా మారే అవకాశం ఉంది’’ అని చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. యవ్వనంలో ఉన్నప్పుడు, వ్యామోహాల వల్ల, ఇంద్రియ చాపల్యాల నుంచి బయటపడలేక లేక పరిస్థితుల కారణంగా ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు. ఆ తప్పు ఎన్ని రకాలుగా ఉంటుందంటే... మొదటిది పొరపాటు, రెండోది తప్పు, మూడోది నేరం, నాలుగోది ఘోరం. పొరపాట్ల స్థాయిలో ఆగిపోతే చాలా మంచిది. అది తప్పు స్థాయికి వెళ్లకుండా చూసుకోవాలి. ఆ తరువాత నేరం, ఘోరం. ఆ స్థాయికి వెళితే కుటుంబం నాశనమయినట్టే! ఒకవేళ అలాంటివే జీవితంలో జరిగినా మనిషి బాగుపడే అవకాశం ఉంది. నీళ్ల ధార వల్ల,  రక్తం ధారపోయడం వల్ల పాపాలు పోవు. జ్ఞాన ధార కావాలి. ఎవరికి వారే ఆ జ్ఞానాన్ని తనలో నింపుకోవాలి. జ్ఞానం వస్తే పాపాలు ఎలా పోతాయి? అదే ఇక్కడ చెబుతున్నాడు. ‘‘భూలోకంలో ఉండే పాపాత్ములందరిలోకి నువ్వే పెద్ద పాపాత్ముడివి అనుకుందాం. అంతకుమించిన పాపాలు ఎవ్వరూ చేయలేదు అనుకుందాం. నిన్ను కూడా జ్ఞానమార్గం ద్వారా మారేలా చేస్తాను’’ అని చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ.

 గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-12-04T05:32:31+05:30 IST