Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందం ఆమె సొంతం.. డేటింగ్‌కు పిలిస్తేచాలు.. పరిగెత్తుకు వస్తున్న యువకులు.. అక్కడ ఆమె చేసే పనులు చూసి, భయంతో వణికిపోతూ..

ఇద్దరు యువతీ యువకుల మధ్య అనుబంధం ఏర్పడినప్పుడు వారు ఏకాంతంగా గడపాలని తపించిపోతుంటారు. ఇటువంటి సందర్భంలో పెద్దల నుంచి, లేదా సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైనప్పుడు ఆ జంట ఎక్కడికైనా పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. అయితే దీనికి భిన్నమైన అనుభవం బ్రిటన్‌కు చెందిన ఒక మహిళకు ఎదురవుతోంది. ఆమెకు ఆకర్షితులై డేట్ కోసం ఆమె ఇంటికి వచ్చినవారంతా భయపడిపారిపోతున్నారు. పైగా మరోమారు ఆమె ముఖాన్ని చూసేందుకు కూడా సాహసించే ప్రయత్నం చేయడం లేదు. 

వివరాల్లోకి వెళితే అలెక్సా థామ్ఫన్ అనే 31 ఏళ్ల మహిళ స్కాట్లాండ్ హైల్యాండ్‌లోని జాన్ ఓగ్రేట్స్‌లో  ఉంటుంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు తన తాత, బామ్మ కొన్ని మంత్ర విద్యలు నేర్పారని, వీటి సాయంతో తాను వేరొకరికి వచ్చే వ్యాధులను, ప్రెగ్నెన్సీని ముందుగానే అంచనా వేసి చెప్పగలనన్నారు. అయితే ఈ విద్య వలన తనకు బాయ్ ఫ్రెండ్ దొరకడం లేదని, ఒకవేళ దొరికినా తనను అంటిపెట్టుకుని ఉండటం లేదని వాపోయింది. అలెక్సా గడచిన 23 ఏళ్లుగా మంత్ర విద్యలను ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె పలు అతీంద్రియ శక్తులను సంపాదించుకున్నానని, ఎవరికైనా వచ్చే వ్యాధులను ముందుగానే చెప్పగలనని పేర్కొంది. ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చాలామంది తనతో పరిచయం ఏర్పరుచుకుని, ప్రపోజ్ చేశారని, అయితే తాను వారిని తన ఇంటికి తీసుకురాగానే, వారు తన మంత్ర సామగ్రిని చూసి పారిపోతున్నారని వాపోయింది. ఇలా తనను కలసిన కొందరికి తాను వారి భవిష్యత్ గురించి చెప్పానని, అప్పటి నుంచి వారు తన ఇంటివైపు కూడా చూడటం లేదని అలెక్సా తెలిపింది. ఫలితంగా తాను సింగిల్‌గానే ఉండాల్సివస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement