Jun 18 2021 @ 01:48AM

బోయ్‌ఫ్రెండ్‌తో.. రూ. 175 కోట్ల బంగ్లాలో..!

తను డేటింగ్‌లో ఉన్న విషయం, తన బోయ్‌ఫ్రెండ్‌ ఎవరనేది.. ఇంతవరకూ జాక్వలిన్‌ ఫెర్నాండజ్‌ నోరు విప్పి చెప్పలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె బిజినెస్‌మాన్‌ అయిన తన బోయ్‌ఫ్రెండ్‌తో కలసి గడపడం కోసం సీ ఫేసింగ్‌ ఉన్న బంగ్లాకు షిఫ్ట్‌ కానున్నారు. ముంబైలో జుహూ ప్రాంతంలో అటువంటి భవంతి కోసం జాక్వలిన్‌ చాలా రోజులుగా వెదుకుతున్నారు. ఆమె అభిరుచులకు అనుగుణంగా ఉన్న భవంతి దొరకడంతో త్వరలోనే అందులోకి వెళుతున్నారట. ఇంతకీ ఆ భవంతి ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా రూ175 కోట్లు. ఆ రేటు వింటే కళ్లు తిరిగి కింద పడిపోయే పరిస్థితి కలుగుతోంది కదూ. దీని బట్టి చూస్తే ఖరీదైన బోయ్‌ఫ్రెండ్‌నే జాక్వలిన్‌ పట్టేసిందని అర్థమవుతోంది కదూ. అతను దక్షిణాదికి చెందిన వ్యాపారవేత్త అట. తమ భవంతి ఎలా ఉండాలో, అందులో ఎలాంటి సదుపాయాలు ఉంటే బాగుంటుందో జాక్వలిన్‌, ఆమె బోయ్‌ఫ్రెండ్‌ తరచూ వీడియో కాల్స్‌లో డిస్కస్‌ చేస్తున్నారని సమాచారం. ఫ్రాన్స్‌కు చెందిన ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థ ఈ భవంతికి సంబంధించిన ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేస్తోందట.