ప్రెగ్నెన్సీ మీది... పే చెక్ మాది!

ABN , First Publish Date - 2021-09-17T00:58:36+05:30 IST

ప్రపంచంలో అత్యధిక జనాభ గల దేశంగా ఇప్పటికీ చైనానే చెబుతారు. కానీ, ఒకప్పుడు ప్రజల్ని బలవంతంగా పిల్లల్ని కనకుండా ఆపిన అక్కడి పాలకులు ఇప్పుడు రివర్స్ గేర్‌లోకి మారారు. ఒక కుటుంబంలో ఎన్ని కాన్పులో... అన్ని కాసులు అంటున్నారు

ప్రెగ్నెన్సీ మీది... పే చెక్ మాది!

ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఇప్పటికీ చైనానే చెబుతారు. కానీ, ఒకప్పుడు ప్రజల్ని బలవంతంగా పిల్లల్ని కనకుండా ఆపిన అక్కడి పాలకులు ఇప్పుడు రివర్స్ గేర్‌లోకి మారారు. ఒక కుటుంబంలో ఎన్ని కాన్పులో... అన్ని కాసులు అంటున్నారు. ఒకర్ని, ఇద్దర్ని కాదు ముగ్గుర్ని కనమంటూ ముద్దుమురిపాల రాయితీలు, నగదు మూటలు ప్రకటిస్తున్నారు!


చైనా మొత్తం మీద జనాభా తరుగుదల లేకున్నా రానున్న కాలంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం జనం సంఖ్య బాగా తగ్గనుంది. అందుకే, ఇప్పట్నుంచీ అలర్ట్ అవుతున్నాయి కొన్ని చైనీస్ కౌంటీస్. అక్కడి స్థానిక ప్రభుత్వాలు మూడో బిడ్డని కనే తల్లిదండ్రులకి నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి. తాజాగా, గన్సు ప్రావిన్స్‌లోని లింజే కౌంటీలో ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు 5 వేల యువాన్లు ప్రకటించారు. అలాగే, మూడో సంతానానికి మూడేళ్లు నిండేలోపు మరో 10 వేల యువాన్లు కూడా అందిస్తామని ప్రచారం చేస్తున్నారు. మూడో బిడ్డ లేకున్నా ఒకరు, ఇద్దరు పిల్లలున్న వారికి కూడా కొంచెం తక్కువ మొత్తంలో ఆర్ధిక సాయం ప్రకటిస్తున్నాయి చైనాలోని స్థానిక ప్రభుత్వాలు. ఇలా చేయటం ద్వారా సామాన్య జనం పిల్లల్ని కనటం వల్ల వచ్చే ఆర్ధిక సవాళ్లను పక్కన పెట్టి జనాభా అభివృద్ధికి తోడ్పడతారని అధికారులు భావిస్తున్నారట. 


చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న పంజిహువా నగరంలో కూడా ఇటువంటి క్యాష్ ఆఫర్సే ప్రకటించారు. జూలైలో తొలిసారి అక్కడ ‘ప్రెగ్నెసీ మీది... పే చెక్ మాది’ అంటూ ప్రజల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే ఫార్ములా లింజే కౌంటీలోనూ అమలవుతోంది. ముందు ముందు చైనాలోని మరిన్ని స్థానిక ప్రభుత్వాలు జనాభా పెంచే పథకాల గురించి ఆలోచన చేయవచ్చు...           

Updated Date - 2021-09-17T00:58:36+05:30 IST