ఉపసంహరణలు.. 223

ABN , First Publish Date - 2021-03-03T05:10:38+05:30 IST

పురపోరులో భాగంగా జిల్లాలో తొలి రోజు మంగళవారం నామినేషన్ల ఉప సంహ రణలు ప్రశాంతంగా జరిగాయి. తొలి రోజున 223 మంది నామినే షన్లను విత్‌ డ్రా చేసుకున్నట్లు అధికారులు ప్రక టించారు.

ఉపసంహరణలు.. 223
చిలకలూరిపేట 28 వార్డులో నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్న తుర్లపాటి జగదీశ్వరి

తొలిరోజు నామినేషన్ల విత్‌డ్రాలు ప్రశాంతం 

పిడుగురాళ్లలో అత్యధికం.. చిలకలూరిపేటలో  అత్యల్పం

పిడుగురాళ్లలో టీడీపీ అభ్యర్థులందరూ ఉపసంహరణ

నేటి మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన


గుంటూరు(కార్పొరేషన్‌), మార్చి 2: పురపోరులో భాగంగా జిల్లాలో తొలి రోజు మంగళవారం నామినేషన్ల ఉప సంహ రణలు ప్రశాంతంగా జరిగాయి. తొలి రోజున 223 మంది నామినే షన్లను విత్‌ డ్రా చేసుకున్నట్లు అధికారులు ప్రక టించారు. జిల్లాలో 7 మున్సి పాలిటీలు, గుంటూరు కార్పొ రేషన్‌తో కలిపి 290 వార్డులు ఉన్నాయి. వీటిలో మాచర్ల మినహా మిగిలిన ఏడు మున్సి పాలిటీ లలో వివిధ పార్టీలకు చెందిన 223 మం ది అభ్యర్థులు నామి నేషన్లు విత్‌ డ్రా చేసుకున్నారు. జిల్లాలోని ఆయా ము న్సిపల్‌ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహం 3 గం టల వరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం మధ్యా హ్నం 3 గంటల వరకు నామి నేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అనంతరం ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించను న్నారు. పిడుగురాళ్లలో అత్యధికంగా 92 మంది, చిలకలూరిపేటలో కేవలం నలుగురు మాత్రమే నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. మాచర్లలో ఒక్క నామినేషన్‌ కూడా ఉపసం హరిం చు కోలేదు. మాచర్లలో 31 వార్డులకు 54 నామి నేషన్లు దాఖలు కాగా మంగళవారం ఎటు వంటి విత్‌డ్రాలు జరగ లేదు. ఇక పిడుగురాళ్లలో టీడీపీ అభ్యర్థులందరూ నామినేషన్లు ఉపసంహరించుకు న్నారు. ఇక్కడ 33 వార్డులకు 23 వార్డుల్లో వైసీపీ తరపున ఒక్కొక్కరే ఎన్నికల బరిలో మిగిలారు. ఎలా గైనా వార్డులను ఏకగ్రీ వం చేసుకుకోవాలని అధికార పార్టీ ప్ర యత్నిస్తోంది. ఈ క్రమంలో వినుకొండలో పలు వార్డుల్లో పోటీగా నామినేషన్‌ వేసిన అభ్య ర్థులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వీటిని తట్టుకోలేక కొంతమంది అభ్యర్థులు పట్టణం వదిలి వెళ్లినట్లు సమాచారం.  32 వార్డులో పోటీకి సిద్ధ పడి న టీడీపీ పార్టీ అభ్యర్థి వ్యాపారంపై దెబ్బతీసేం దుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరో పణలు వస్తున్నాయి.  


 - గుంటూరు నగరపాలక సంస్థలో 57 డివిజన్లకు 33 మంది నామినేషన్లు విత్‌ డ్రా చేసుకున్నారు. ఇందులో సీపీఎం-2 జన సేన-2 టీడీపీ - 9, వైసీపీ - 8, ఇండి పెండెంట్లు 12 మంది ఉన్నారు.


- తెనాలిలో 25మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బీజేపీ 1, కాంగ్రెస్‌ 3, జనసేన 1, టీడీపీ 10, వైసీపీ 9, స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు  నామినేషన్లను ఉపసంహరించుకున్న ట్లు కమిషనర్‌ జస్వంతరావు తెలిపారు.


- చిలకలూరిపేటలో 38 వార్డులకు నలుగురు నా మినేషన్లు విత్‌ డ్రా చేసుకున్నారు. అందులో టీడీపీ - 2, వైసీ పీ - 1, ఇండిపెండెం ట్‌ 1  ఉన్నారు. 

 -రేపల్లెలో 16 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని మున్సిపల్‌ కమిషనర్‌ విజయసారఽథి తెలిపా రు. అందులో కాంగ్రెస్‌-1, టీడీపీ-6, వైసీపీ-9 చొప్పున ఉన్నారు.


- సత్తెనపల్లిలో 31 వార్డులకు 18 మంది నామినేష న్లు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్‌-1, జనసేన -2, టీడీపీ-2, వైసీపీ-16, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు.


-వినుకొండలో 35 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వీరిలో టీడీపీ - 5, వైసీపీ  డమ్మీ - 17, ఇండిపెండెంట్లు - 9, బీజేపీ -2, జన సేన-2 నామినేషన్లు విత్త్‌డ్రా చేసుకున్నారు. దీంతో 6, 9, 26, 29, 30, 31 వార్డుల్లో ఒక్కొక్క నామి నేషన్‌ మిగిలినట్లు కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు.


- పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులకు 135 మంది నామినేషన్లు వేయగా తొలి రోజు 92 మంది అభ్య ర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. టీడీపీ 43, వైసీపీ 31, జనసేన 5, బీజేపీ 5, సీపీఎం 1, కాంగ్రెస్‌ 1, ఇత రు లు ఆరుగురితో కలిపి మొత్తం 92 మంది నామినేష న్లు ఉపసంహరించుకున్నారు. టీడీపీ తరపున నామినేషన్‌ వేసిన అభ్యర్థులందరూ మంగళవారమే ఉప సంహరణ పత్రాలను అధికారులకు అందజేశారు.  


 

Updated Date - 2021-03-03T05:10:38+05:30 IST