ఫేస్‌ మసాజ్‌తో

ABN , First Publish Date - 2020-09-23T05:30:00+05:30 IST

రోజంతా పనిలో అలసిపోయినప్పుడు ఒళ్లంతా మసాజ్‌ చేసుకుంటే ఎంతో రిలీ్‌ఫగా ఉంటుంది. అలానే ముఖానికి మసాజ్‌ చేస్తున్నట్లు రుద్దుకోవాలి. దాంతో ముఖానికి రక్తప్రసరణ

ఫేస్‌ మసాజ్‌తో

రోజంతా పనిలో అలసిపోయినప్పుడు ఒళ్లంతా మసాజ్‌ చేసుకుంటే ఎంతో రిలీ్‌ఫగా ఉంటుంది. అలానే ముఖానికి మసాజ్‌ చేస్తున్నట్లు రుద్దుకోవాలి. దాంతో ముఖానికి రక్తప్రసరణ పెరిగి చర్మం యవ్వనంగా మారుతుంది. వయసుతో పాటు ఏర్పడే ముడతలు తగ్గిపోతాయి. 

 ముఖాన్ని మసాజ్‌ చేయడం వల్ల పూర్తిగా టోన్‌ కూడా అవుతుంది. వలయాకారంలో, పై నుంచి కిందకు మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి రక్తప్రసరణ పెరుగుతుంది.

 మసాజ్‌ చేయడం అంటే ముఖం మీది మలినాలను తొలగించడమే. అలానే స్క్రబ్బింగ్‌ చేసేటప్పుడు నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. దాంతో మృతకణాలు, మురికి, నల్లమచ్చలు వదులుతాయి.

 వంట గదిలో మీకు నచ్చిన పదార్థాలతో ఇంటి వద్దనే ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకోవడం మంచిది. ఇలా మీ చర్మతత్వానికి సరిపడే ప్యాక్‌ సిద్ధం చేసుకోవాలి. 


Updated Date - 2020-09-23T05:30:00+05:30 IST