Abn logo
Oct 26 2021 @ 22:54PM

మత్తు పదార్థాలతో దుష్పరిణామాలు

ప్రతిజ్ఞ చేయిస్తున్న సెబ్‌ అధికారులు

ఆత్మకూరు, అక్టోబరు 26 : యువత మత్తు పదార్థాలకు అలవాటుపడితే దుష్ఫరిణామాలు తలెత్తి జీవితాలు నాశనమవుతాయని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ నయనతార, సెబ్‌ స్పెష్షల్‌ స్క్వాడ్‌ సీఐ బాలకృష్ణ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రమాణం చేయించారు.  కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ రంగనాయకులు, అధ్యాపకులు, సిబ్బంది, సెబ్‌ సిబ్బంది పాల్గొన్నారు.