నోటీసులు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-21T06:14:12+05:30 IST

నోటీసులు ఉపసంహరించుకోవాలి

నోటీసులు ఉపసంహరించుకోవాలి
మాట్లాడుతున్న దండు సుబ్రహ్మణ్యంరాజు

విజయవాడ రూరల్‌, జనవరి 20: పేదలందరికీ ఇళ్లు పథకం కింద నివేశన స్థలాలు పొందిన వారం దరికీ ఇల్లు నిర్మించనందుకు చర్యలెందుకు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం ఇస్తున్న నోటీసులను తక్షణమే ఉప సంహరించుకోవాలని, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యంరాజు డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులతో కలిసి వెళ్లి నున్నలో నోటీసు అందుకున్న వారితో సుబ్రహ్మణ్యంరాజు గురువారం మాట్లాడారు. పేదలందరికీ పట్టాలు పంపిణీ చేసినపుడు ప్రభుత్వం గృహ నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చిందని, అందులో చాలా మంది ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వమే ఇచ్చిన మాట తప్పిందని, వైసీపీ సర్కార్‌ మడమ తిప్పిందని రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటక సుబ్బారెడ్డి, గంపా శ్రీనివాస్‌ యాదవ్‌, శివరామప్రసాద్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-01-21T06:14:12+05:30 IST