Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాఠశాలల విలీనాన్ని ఉపసంహరించుకోండి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం

రాజాం/రేగిడి, నవంబరు 29: నూతన విద్యావిధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తోందని, దీనివల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని, ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పీడీఎఫ్‌ ఫ్లోర్‌లీడర్‌, ఎమ్మెల్సీ వి.సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. సోమవారం రేగిడి మండలం కోడిశ పాఠశాలను పరిశీలించారు. రాజాంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలలున్నాయని, కొత్త విద్యావిధానంతో 12 వేల పాఠ శాలలకు మార్చాలని సన్నాహాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1, 2 తరగతులకు ప్రాథమిక పాఠశాలల నుంచి విడదీసి అంగన్‌వాడీతో కలపడం వల్ల ప్రాథమిక పాటశాలలు కనుమరుగువు తాయన్నారు. కేరళలో ప్రతి తరగతి గది డిజిటలైజేషన్‌తో ఉన్నాయని, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ మాదిరిగా కామన్‌ స్కూల్‌ వ్యవస్థను మన రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమాల్లో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి పక్కి వాసు, రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు. ఎస్‌.కిశోర్‌ కుమార్‌, స్థానిక యూనియన్‌ నేతలు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement