పన్నుల పెంపును ఉపసంహరించుకోండి

ABN , First Publish Date - 2021-08-03T05:41:25+05:30 IST

పన్నుల పెంపును ఉపసంహరించకపోతే చట్టపరంగా పోరాటం చేస్తామని జిల్లా టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు కూన రవికుమార్‌ హెచ్చరించారు.

పన్నుల పెంపును ఉపసంహరించుకోండి
ఆమదాలవలస: మునిసిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న రవికుమార్‌

టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు రవికుమార్‌ 

ఆమదాలవలస:పన్నుల పెంపును ఉపసంహరించకపోతే చట్టపరంగా పోరాటం చేస్తామని జిల్లా టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు కూన రవికుమార్‌ హెచ్చరించారు. సోమవారం ఆమదాలవలస పురపాలక సంఘం కమిషనర్‌ రవిసుధాకర్‌కు  పన్నులు పెంపుపై  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా    పురపాలక సంఘం ప్రత్యేకాధికారుల పాలనలో ఉందని, పన్నులు పెంచే అధికారం ప్రజలు ఎన్నుకోబడిన  కౌన్సిల్‌కు మాత్రమే ఉందని, పన్నులు ఎలా పెంచుతారని రవికుమార్‌ నిలదీశారు. పాలించడం తప్ప, తీర్మానాలు చేసే అర్హత అధికారులకు లేదన్నారు. పన్నులు పెంచే ముందు పార్టీలు,  ప్రజాసంఘాలతో  ఎందుకు సమావేశం ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కన్వర్జెన్సీ, సాధారణ పన్నుల  విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.పన్నులు కట్టకపోతే జరిమాన వేస్తామని రాజపత్రం జారీచేయడంపై మండిపడ్డారు. అధికారులు పన్నులు పెంచితే ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా స్పీకర్‌ ఏమిచేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి మొదలవలస రమేష్‌, జిల్లా తెలుగు యువత కార్యదర్శి అనెపు రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావు, సనపల ఢిల్లీరావు పాల్గొన్నారు.

 సాగునీరు అందించాలి

గార: మండల పరిధిలోని భైరి, వంశధార, నారాయణపురం కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని టీడీపీ నాయకులు కోరారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. సాగునీరు అందక దమ్ములు చేసేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణం సాగునీటిని విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, వెంకటప్పారావు, నాయకులు పొట్నూరు కృష్ణమూర్తి, జల్లు రాజీవ్‌, పి,వైకుంఠరావు, గోర సురేష్‌, కోరాడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

తోటపల్లి కాలువను ఆధునికీకరించండి

పాలకొండ:తోటపల్లి ఎడమ కాలువకు ఆధునికీకరించా లని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చం ద్రబాబునాయుడుకు లేఖ రాశారు. కాలువ ఆధునికీకరణకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును కోరారు.  


 






Updated Date - 2021-08-03T05:41:25+05:30 IST