ఉపసంహరణలు ఇలా..

ABN , First Publish Date - 2021-03-03T05:53:22+05:30 IST

పట్టణంలో 23 వార్డులకు గాను టీడీపీ నుంచి 58 మంది నామినేషన్లు దాఖలు చేయగా 33 మంది ఉపసంహరించుకున్నారు.

ఉపసంహరణలు ఇలా..
కొవ్వూరులో నామినేషన్లు ఉపసంహరించుకుంటున్న అభ్యర్థులు

కొవ్వూరు, మార్చి 2: పట్టణంలో 23 వార్డులకు గాను టీడీపీ నుంచి 58 మంది నామినేషన్లు దాఖలు చేయగా 33 మంది ఉపసంహరించుకున్నారు.  వైసీపి 49 మందికి గాను 22 మంది, స్వతంత్రులు 5 గురికి నలుగురు, సీపీఎం 2 నామినేషన్లకు గాను ఒక  నామినేషన్లను మొదటిరోజు ఉపసంహరించుకున్నారు. ఇంకా వైసీపీ 27, టీడీపీ 25, సీపీఎం 1, స్వతంత్రులు 1, బీజేపీ 7, జనసేన 4, బీఎస్పీ ఒక స్థానంలో నామినేషన్లు మిగిలి ఉన్నాయి.

జంగారెడ్డిగూడెంలో 7

జంగారెడ్డిగూడెం, మార్చి 2: జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మొదటి రోజు మంగళవారం 7 నామినేషన్‌లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్టు మున్సిప ల్‌ కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. పట్టణంలోని 1, 12, 17, 18, 19, 23, 26 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏడుగురు తమ నామినేషన్‌లు ఉపసంహ రించుకున్నట్టు కమీషనర్‌ తెలిపారు. మొత్తం 29 వార్డులకు గాను 128 మంది నామినేషన్లు దాఖలు చేయగా తొలిరోజు 7 నామినేషన్ల ఉపసంహరణతో 121 మంది బరిలో ఉన్నారు. 

Updated Date - 2021-03-03T05:53:22+05:30 IST