Abn logo
Sep 26 2021 @ 00:22AM

కో ఆప్షన ఎన్నిక లేకుండానే...

డిక్లరేషన ఫారం అందుకుంటున్న ఎంపీపీ రేణుక

అగళి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు

అగళి, సెప్టెంబరు 25: అగళి మండల కేంద్రంలో శనివారం కో-ఆప్షన ఎన్నిక లేకనే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల అధికారి మల్లికార్జున ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్‌ సుధాకర్‌, పరిపాలన అధికారి శ్రీనివాసరావు, ఈఓఆర్‌డీ మహేష్‌ ఎన్నికలు నిర్వహించారు. కో-ఆప్షన ఎన్నిక ప్రస్తుతం జరగడం లేదని ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తామని నిర్వహించారు. మండల వ్యాప్తంగా పది మంది ఎంపీటీసీ సభ్యులకుగాను ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, ఎనిమిది మంది వైసీపీ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. అందులో టీడీపీ ఎంపీటీసీలు హాజరుకాలేదు. ఎనిమిది మంది వైసీపీ ఎంపీటీసీలు హాజరయ్యారు. వీరికి ఒంటిగంట సమయంలో వీరితో మొదట ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. ఎంపీపీ అధ్యక్ష పదవి కోసం కోడిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి బి.కె.రేణుక నామినేషన వేశారు. ఎంపీపీగా బి.కె.రేణుకను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అనంతరం వైస్‌ ఎంపీపీగా ఇరిగేపల్లి ఎంపీటీసీ అభ్యర్థి గాయిత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఎన్నికల అధికారి మల్లికార్జున మొదట ఎంపీపీ బి.కె.రేణుకను ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయించారు.  వైస్‌ ఎంపీపీ గాయత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్‌ ఎంపీపీకి డిక్లరేషన అందజేశారు. వీరిద్దరికీ ఎన్నికల అధికారి, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్‌, పరిపాలన అధికారి, ఈఓఆర్‌డీలు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శ్రీరామ్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐలు మక్బూల్‌బాషా, దివ్యా బందోబస్తును పర్యవేక్షించారు.

అమరాపురం: అమరాపురం ఎంపీపీగా ఈరన్న ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మొదటగా హేమావతికి చెందిన రసూల్‌బాషాను కో-ఆప్షన మెంబర్‌గా ఎన్నుకొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీటీసీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్‌ ఎంపీపీ కృష్ణమూర్తిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అనంతరం వీరిని  రిటర్నింగ్‌అధికారి అమర్‌, తహసీల్దార్‌ అపర్ణ, ఎంపీడీఓ మునిస్వామిలు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కోఆప్షన మెంబర్‌లను శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు.