చర్మ సౌందర్యం దెబ్బతినకుండా..!

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

ఈ సీజన్‌లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా ఉండటానికి, అదనపు ఆయిల్‌ను తొలగించుకోవడానికి రెండు, మూడుసార్లు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

చర్మ సౌందర్యం దెబ్బతినకుండా..!

  • ఈ సీజన్‌లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా ఉండటానికి, అదనపు ఆయిల్‌ను తొలగించుకోవడానికి రెండు, మూడుసార్లు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. 
  • ఎండ లేదు కదా అని సన్‌స్ర్కీన్‌ రాసుకోకుండా  ఉండటం కరెక్ట్‌ కాదు. తప్పనిసరిగా నాణ్యమైన సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను ఉపయోగించాలి.
  • వర్షాలు ప్రారంభం కాగానే నీళ్లు తాగడం తగ్గించేస్తారు. అలాకాకుండా తగినన్ని నీళ్లు తాగాలి.
  • చర్మరంధ్రాలు తెరుచుకునేలా చేయడం కోసం కొబ్బరినూనె, టీ ట్రీఆయిల్‌, అలోవెరా, తేనె, రోజ్‌వాటర్‌ను వాడొచ్చు.
  • ముల్తానీ మట్టిలో లవంగాల నూనె, గంధం పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • శనగపిండిలో పసుపు, నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేసుకుని కూడా వాడొచ్చు. ఇలా చేయడం మేనికి సహజసిద్ధమైన మెరుపు వస్తుంది.

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST