చిన్నారుల చర్మం దెబ్బతినకుండా...

ABN , First Publish Date - 2021-02-13T05:31:45+05:30 IST

ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గినా దాని ప్రభావం చిన్నారులపై బాగా పడుతుంది. చల్లదనం వల్ల పిల్లల సున్నితమైన

చిన్నారుల చర్మం దెబ్బతినకుండా...

ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గినా దాని ప్రభావం చిన్నారులపై బాగా పడుతుంది. చల్లదనం వల్ల  పిల్లల  సున్నితమైన చర్మం పొడి బారినట్టు అవుతుంది. దీంతో మృదువుగా ఉండే చిన్నారుల బుగ్గలు రఫ్‌గా తయారవుతాయి. పసిపిల్లల మాడు మీది చర్మంపై కూడా చల్లదనం ప్రభావం  పడుతుంది. అందుకే చలికాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గినపుడు చిన్నారుల చర్మం దెబ్బతినకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 


చిన్న పిల్లల మృదువైన చర్మంలో సమతుల్యత లోపించకుండా ఉండేందుకు ఎక్స్‌ట్రా మాయిశ్చరైజింగ్‌ బేబీ ఉత్పత్తులను వాడాలి. చర్మంలో తేమను పరిరక్షించే మూలికలు, ఆయిల్స్‌తో కూడుకున్న ఆయిల్స్‌ వాడాలి. అవి షాంపు కావచ్చు, క్రీము, లోషన్లు కావచ్చు. సబ్బు కావచ్చు. చిన్నారులకు అవి  సురక్షితమైనవై ఉండాలి.


ఆ రోజు వాతావరణం బట్టి  చిన్నారికి తలస్నానం చేయించాలి. పాపాయిలకు ఉపయోగించే వేడి  నీళ్ల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. వేడి బాగా ఉండే  నీళ్లు చిన్నారులకు ఉపయోగిస్తే సున్నితంగా ఉండే పాపాయి స్కిన్‌ టెక్చర్‌ దెబ్బతింటుంది.


బేబీకి స్నానం చేయించేటప్పుడు ఎక్స్‌ట్రా మాయిశ్చరింగ్‌ ఉండే  బాడీ వాష్‌ని వాడాలి. 


ప్రకృతి సిద్ధమైన బాదం, ఆలివ్‌, అలొవెరాలు చిన్నారుల చర్మాన్ని ఎంతగానో పరిరక్షిస్తాయి. ఇవి మంచి మాయుశ్చరైజర్లు. వీటిని వాడడం వల్ల చిన్నారుల్లో పోస్ట్‌-బాత్‌ డ్రైనెస్‌ సమస్య తలెత్తుదు. మైల్డ్‌ లేదా సోప్‌-ఫ్రీ క్లిన్సర్లను కూడా బేబీలకు వాడొచ్చు. 


పాపకు స్నానం చేయించిన తర్వాతే చర్మానికి మాయిశ్చరైజర్లు రాయాలన్న విషయం మరవొద్దు. అలొవిరా, ఆలివ్‌, బాదం ఆయిల్స్‌ ఉన్న బేబీ లోషన్లు వాడితే చిన్నారుల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. 


రఫ్‌గా తయారైన పాప బుగ్గలు, చీరుకుపోయినట్టు ఉన్న మోకాళ్లు, సన్నితమైన ముక్కు, మోచేతులకు కౌంటీ మల్లో  బాగా ఉన్న బేబీ క్రీమ్స్‌ వాడితే మంచిది. ఇందులో యాంటాక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు చర్మం దెబ్బతినకుండా నియంత్రించే గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఆలివ్‌ నూనె కూడా ఇందులో బాగా ఉంటుంది.


పైన చెప్పిన వాటితోపాటు నిత్యం బేబీకి  ఆయిల్‌ మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల చిన్నారుల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 


Updated Date - 2021-02-13T05:31:45+05:30 IST