Abn logo
Oct 22 2021 @ 23:24PM

అనుమతులు రాకుండానే మట్టి తరలింపు

వెంకన్నపాళెం వద్ద కండలేరు కాలువలో మట్టి లోడు చేస్తున్న ఎక్స్‌కవేటర్‌

మనుబోలు, అక్టోబరు 22: అనుమతులు లేకుండా మట్టి, ఇసుక తరలించకూడదని నీటిపారుదల అధికారులు చెపుతున్నా పట్టించుకోకుండా శుక్రవారం వెంకన్నపాళెం వద్ద కండలేరు కాలువ నుంచి రెండో దఫా మట్టి తరలించారు. భారీ ఎక్స్‌కవేటర్‌ పెట్టి కాలువగర్భంలో ఉన్న ఇసుకను తవ్వేశారు. మట్టితరలిస్తున్న వ్యక్తులు మాట్లాడుతూ తామేమి అమ్ముకోవడం లేదని, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సచివాలయాలు, కమ్యూనిటీహాలు అవసరం కోసం తరలిస్తున్నామన్నారు. మట్టి, ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్నారే తప్ప అధికారులనుంచి అనుమతులు రాలేదని ఓ పక్క ఏఈ. ఠాగూర్‌ చెపుతున్నారు.  వెంకన్నపాళెం గ్రామస్థులు కాలువలో మట్టి తీయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.  కాలువ నాణ్యత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.