హిట్లర్‌ రహస్య బంకర్‌ ఇదే!

ABN , First Publish Date - 2021-09-03T05:30:00+05:30 IST

ఆ ప్రదేశం గురించి చుట్టు పక్కల వారికి కూడా తెలియదు. అక్కడ అడుగుకో మందుపాతర ఉంటుంది. యుద్ధ వ్యూహాలను అక్కడి నుంచే రచించేవారు. దట్టమైన అడవిలో జర్మన్‌ నియంత హిట్లర్‌ రహస్య బంకర్‌...

హిట్లర్‌ రహస్య బంకర్‌ ఇదే!

ఆ ప్రదేశం గురించి చుట్టు పక్కల వారికి కూడా తెలియదు. అక్కడ అడుగుకో మందుపాతర ఉంటుంది. యుద్ధ వ్యూహాలను అక్కడి నుంచే రచించేవారు. దట్టమైన అడవిలో జర్మన్‌ నియంత హిట్లర్‌ రహస్య బంకర్‌ అది. ఇప్పుడా ప్రదేశం పర్యాటకులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విశేషాలు ఇవి...


  1. జర్మన్‌ నియంత హిట్లర్‌ పోలండ్‌పై దాడి చేసి ఆక్రమించాడు. ఆ తరువాతే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. పోలండ్‌లోని రస్టెన్‌బర్గ్‌ పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో హిట్లర్‌ రహస్య బంకర్‌ నిర్మించుకున్నాడు. ఆ ప్రదేశాన్ని వోల్ఫ్‌ లైర్‌ అని పిలిచేవారు. ఈ బంకర్‌ నిర్మాణ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కృత్రిమ పొదలు, చెట్లను ఏర్పాటు చేసి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బంకర్‌లో హిట్లర్‌ దాదాపు 850 రోజులు గడిపాడు. ఇక్కడి నుంచే యుద్ధవ్యూహాలు అమలుచేశాడు. 
  2. ఇక్కడ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్స్‌తో నిత్యం పహారా కాసే వారు. బంకర్‌ గోడలు రెండు మీటర్ల మందంతో ఉండేవి. ఇక ఆ బంకర్‌ చుట్టు పక్కల అడుగుకో ల్యాండ్‌మైన్‌ పెట్టారని చెబుతారు. 1945లో ఈ ప్రదేశాన్ని పేల్చివేశారు. దాదాపు పదేళ్ల పాటు శ్రమించి 54 వేల మందుపాతరలను తొలగించారు. 
  3. ఇక్కడే ఒకసారి బ్రీఫ్‌కేస్‌లో బాంబు పెట్టి హిట్లర్‌ను హతమార్చేందుకు ప్రయత్నించారు. అయితే సరిగ్గా పేలుడు జరిగే సమయానికి హిట్లర్‌ బ్రీఫ్‌కేస్‌కు దూరంగా జరగడంతో గాయాలతో బయటపడ్డారు. ఈ కథతోనే ‘వాల్కైర్‌’ సినిమా తీశారు. 

Updated Date - 2021-09-03T05:30:00+05:30 IST