Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 14 2020 @ 07:13AM

షాకింగ్...మెట్రోరైలులో మహిళపై ఆకతాయి లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని మెట్రో రైలులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ గురుగ్రామ్ నగరంలోని కార్యాలయం నుంచి ఇంటికి మెట్రోరైలులో రాత్రి 6.11 గంటల సమయంలో తిరిగి వస్తుండగా ఎదురుగా నిల్చున్న ఓ ఆకతాయి యువకుడు తన ప్యాంటు నుంచి పురుషాంగాన్ని బయటకు తీసి చూపించాడు. తన పురుషాంగాన్ని నిమిషం పాటు మహిళకు చూపించడంతో ఆమె షాక్ కు గురై కిందకు చూశారు. అనంతరం ఆకతాయి తలుపు వద్దకు చేరుకోవడంతో మహిళ తేరుకొని అతని ఫోటోను తన మొబైల్ ఫోన్ తో తీసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఢిల్లీలో సంచలనం రేపింది. మెట్రోరైలులో జరిగిన ఘటనపై బాధిత మహిళ ఘీటోర్నీ మెట్రో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధిత మహిళ తనకు మెట్రోరైల్లో ఎదురైన ఘటన గురించి ట్విట్టర్‌లో వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆకతాయి నిందితుడి గురించి ఆరా తీస్తున్నారు. మెట్రోరైలులో లైంగిక వేధింపులు జరిగినపుడు మహిళలు వెంటనే ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబరు 155370, సీఐఎస్ఎఫ్ హెల్ప్ లైన్ నంబరు 155655 లకు ఫోన్ చేయాలని, లేదంటే వెంటనే సమీపంలోని మెట్రో రైలు అధికారులను సంప్రదించాలని అధికారులు కోరారు.

Advertisement
Advertisement
Advertisement