ఆర్మీలో ఉద్యోగం.. సెలవు పెట్టి ఇంటికొచ్చిన కూతురు తండ్రికి ఓ మెసేజ్ పెట్టింది.. ఉదయం మెసేజ్ చూసిన తండ్రి కూతురి గదిలోకి వెళ్లి చూస్తే ఘోరం

ABN , First Publish Date - 2021-10-19T06:17:52+05:30 IST

దేశానికే రక్షణ కల్పించే ఆర్మీలో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. 2 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అమ్మాయి సెలవుపై..

ఆర్మీలో ఉద్యోగం.. సెలవు పెట్టి ఇంటికొచ్చిన కూతురు తండ్రికి ఓ మెసేజ్ పెట్టింది.. ఉదయం మెసేజ్ చూసిన తండ్రి కూతురి గదిలోకి వెళ్లి చూస్తే ఘోరం

జైపూర్: దేశానికే రక్షణ కల్పించే ఆర్మీలో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. 2 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అమ్మాయి సెలవుపై ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకుంది. తనను ఓ అమ్మాయి తెగ ఇబ్బంది పెడుతున్నాడని, అతడి బాధ తట్టుకోలేకే చనిపోతున్నానని ఆమె మెసేజ్ పెట్టడంతో అసలు విషయం బయటపడింది. కానీ అప్పటికే ఆమె చనిపోవడంతో ఆమె తండ్రి తీవ్ర దు:ఖంలో మునిగిపోయాడు.


గోవర్ధన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛవి అనే యువతి గోవర్ధన్ పోలీస్ స్టేషన్ పరిథిలో కృష్ణా కాలనీలో నివశిస్తోంది. 2ఏళ్ల క్రితం ఆమెకు ఆర్మీలో లాన్స్ నాయక్‌గా ఉద్యోగం లభించింది. అయితే అక్టోబర్ 2న తనకు సెలవు దొరికిందంటూ ఇంటికొచ్చింది. అయితే రాత్రి పడుకునేందుకు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఛవి తండ్రి మొబైల్‌కు ఓ మెసేజ్ పంపించింది. అప్పటికే నిద్ర పోవడంతో ఆమె తండ్రి మెసేజ్‌‌ చూడలేదు. ఉదయం నిద్రలేని మొబైల్ చూడడంతో కూతురి మేసేజ్ కనిపించింది.


పక్క గదిలో నుంచి మెసజ్ పంపించడమేంటని ఆలోచనలో పడిన ఆయన చదవడం ప్రారంభించాడు. ‘తానను ప్రవీణ్ అనే ఓ యువకుడు ఇబ్బంది పెడుతున్నాడని, అతడు తన ఫోటోలను సంపాదించాడని, వీడియోలు తీసి మొత్తం ఆన్‌లైన్‌లో వైరల్ చేసేశాడని, అతడి బాధ తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ మెసేజ్‌లో ఛవి పేర్కొంది.


ఈ మెసేజ్ చూసిన ఆమె తండ్రి పరుగుపరుగున ఛవి గదిలోకి వెళ్లి చూశాడు. అక్కడ ఆమె ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుంది. వెంటనే ఆమెను దింపిన తండ్రి.. ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ డాక్టర్లు పరీక్షించి ఛవి అప్పటికే మరణించినట్లు తెలిపారు. దీంతో కన్నీరుమున్నీరైన ఛవి తండ్రి.. గోవర్ధన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


Updated Date - 2021-10-19T06:17:52+05:30 IST