మహిళకు అశ్లీల ఫొటో పంపిన నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-02-28T11:23:57+05:30 IST

ఓ మహిళతో ఫోనులో అసభ్యంగా మాట్లాడటంతోపాటు వాట్సప్‌కు అశ్లీల ఫొటో పంపిన నిందితుడు సాంబయ్యను తిరుపతి ఈస్ట్‌ పోలీసులు గురువారం అరెస్టుచేశారు.

మహిళకు అశ్లీల ఫొటో పంపిన నిందితుడి అరెస్ట్‌

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 27: ఓ మహిళతో ఫోనులో అసభ్యంగా మాట్లాడటంతోపాటు వాట్సప్‌కు అశ్లీల ఫొటో పంపిన నిందితుడు సాంబయ్యను తిరుపతి ఈస్ట్‌ పోలీసులు గురువారం అరెస్టుచేశారు. దీనికి సంబంధించి ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పరవోలు గ్రామానికి  చెందిన కస్తూరి సాంబయ్య (30) తిరుపతికి చెందిన ఓ మహిళతో ఈనెల 13వ తేదీన ఫోనులో అసభ్యంగా మాట్లాడాడు. దాంతోపాటు వాట్సప్‌లో అశ్లీల ఫొటోను ఆమెకు పంపించాడు. మహిళ ఫిర్యాదు మేరకు ఈస్ట్‌ ఎస్‌ఐ ఇమ్రాన్‌బాషా కేసు నమోదుచేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో సాంబయ్య తన ఊరికి వెళ్లేందుకు తిరుపతి బస్టాండులో ఉండగా ఎస్‌ఐ ఇమ్రాన్‌బాషా, సిబ్బంది అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారని సీఐ తెలిపారు. 

Updated Date - 2020-02-28T11:23:57+05:30 IST