నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్ చెంపలు వాయించిన మహిళ.. వైరల్‌గా మారిన వీడియో.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-17T22:04:50+05:30 IST

నడిరోడ్డుపై ఓ మహిళ వీరంగం సృష్టించింది.. రోడ్డు మధ్యలో బైక్ పార్క్ చేసి ఓ క్యాబ్ డ్రైవర్‌పై విరుచుకుపడింది..

నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్ చెంపలు వాయించిన మహిళ.. వైరల్‌గా మారిన వీడియో.. అసలేం జరిగిందంటే..

నడిరోడ్డుపై ఓ మహిళ వీరంగం సృష్టించింది.. రోడ్డు మధ్యలో బైక్ పార్క్ చేసి ఓ క్యాబ్ డ్రైవర్‌పై విరుచుకుపడింది.. అతడి కాలర్ పట్టుకుని కొట్టింది.. మధ్య వేలు చూపిస్తూ బూతులు తిట్టింది.. అడ్డు వచ్చిన ఇతరులపై కూడా విరుచుకుపడింది.. ఇంతకీ ఆ క్యాబ్ డ్రైవర్ చేసిన నేరం ఏంటంటే.. ఆమె హారన్ కొట్టిన వెంటనే దారి ఇవ్వకపోవడం.. ఆ మాత్రం దానికే ఆ మహిళ రెచ్చిపోయింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని అత్యంత బిజీగా ఉండే వెస్ట్ పటేల్ నగర్ రోడ్డుపై ఓ మహిళ మరో మహిళతో కలిసి స్కూటీపై ప్రయాణం చేస్తోంది. అత్యంత రద్దీగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఆమె హారన్ కొడుతున్నా ఓ క్యాబ్ డ్రైవర్ ఆమెకు దారి ఇవ్వలేదు. దీంతో ఆమె రెచ్చిపోయి అతడిపై దాడికి పాల్పడింది. కాలర్ పట్టుకుని కొట్టింది. బూతులు తిట్టింది. ఇతర ప్రయాణికులపై కూడా విరుచుకుపడింది. ఆ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మహిళ గురించి పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. 



Updated Date - 2021-11-17T22:04:50+05:30 IST