ప్రాణాల మీదకు తెచ్చిన డేటింగ్ యాప్.. కుర్రాడిని కలవడానికి వెళ్లి..

ABN , First Publish Date - 2020-11-19T03:42:19+05:30 IST

ప్రాణాల మీదకు తెచ్చిన డేటింగ్ యాప్.. కుర్రాడిని కలవడానికి వెళ్లి..

ప్రాణాల మీదకు తెచ్చిన డేటింగ్ యాప్.. కుర్రాడిని కలవడానికి వెళ్లి..

ఆంధ్రజ్యోతి వెబ్‌ డెస్క్: నేటి కాలంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యవసరాల జాబితాలో సోషల్ మీడియా చేరి చాలా కాలమే అయింది. కాగా, ఈ సోషల్ మీడియా పరిచయాలు కొంత మేలు చేస్తున్నాయి, కొందరికి కీడు చేస్తున్నాయి. సోషల్ మీడియా పరిచయాల అనంతరం జరుగుతున్న నేరాల గురించి మనం రోజూ చదువుతూనే ఉన్నాం. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువతి, తనకు పరిచమైన ఓ కుర్రాడిని కలవడానికి వెళ్లింది. అదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఇక చచ్చిపోతాను అని డిసైడ్ అయ్యాక.. ఓ అద్భుతంగా పోలీసులు కనిపించి ప్రాణాలు పోశారు.


బ్రిట్నీ కొరేరి అనే మహిళకు ఎదురైన సంఘట ఇది. తనకు జరిగిన ఉదంతం గురించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చింది. ‘‘నేను ఎవరి సానుభూతి కోసమో, ప్రశంసల కోసమే కాదు, కానీ నాకు ఎదురైన కిరాతక అనుభవాన్ని మీరు తెలుసుకుని జీవితంలో జాగ్రత్తగా ఉంటారని షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా మహిళల కోసం దీనిని షేర్ చేస్తున్నాను. మొట్టమొదటి సారిగా డేటింగ్ యాప్‌లో పరిచమైన బెంజమిన్ ఫాంచర్ అనే కుర్రాడిని కలుద్దామని బుధవారం వెళ్లాను. కలుసకున్న కాసేపు ఇద్దరం సరదాగా తిరిగాం. ఇంతలో ఏం జరిగిందో.. ఉన్నట్టుండి నన్ను కొట్టడం ప్రారంభించాడు. నాకు ఏం అర్థం కాలేదు. ముఖంపై వీపులో నా శరీరం మొత్తం దెబ్బలతో నింపేస్తున్నాడు.


తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను. నావల్ల కాలేదు. ఒక్కసారిగా తుపాకీ తీసి నన్ను చంపుతానని బెదిరించాడు. ఇక నేను చచ్చిపోయాననే మెంటల్‌గా ఫిక్సయ్యాను. కానీ ఇంతలో ఒక మహిళా భద్రతా సిబ్బంది కనిపించారు. ఆమెనే నా జీవితాన్ని కాపాడింది. ఆమె లేకపోతే నేనేమైపోయేదాన్నో తలుచుకుంటేనే భయంగా ఉంది. సినిమాల్లో కథల్లో జరిగే ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలోనూ జరుగుతాయని, అలాంటి వ్యక్తులు ఉంటారని ఈరోజే తెలిసింది. కాబట్టి మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా తెలియని వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నేను హెచ్చరిస్తున్నాను’’ అని తన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్రిట్నీ రాసుకొచ్చింది.

Updated Date - 2020-11-19T03:42:19+05:30 IST