హోలీ వేడుకలను వ్యతిరేకించిన వృద్ధురాలిని కొట్టి చంపేశారు!

ABN , First Publish Date - 2021-03-30T01:45:05+05:30 IST

హోలీ వేడుకలను వ్యతిరేకించిన 60 ఏళ్ల వృద్ధురాలిని కొందరు కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన

హోలీ వేడుకలను వ్యతిరేకించిన వృద్ధురాలిని కొట్టి చంపేశారు!

ఇటావా: హోలీ వేడుకలను వ్యతిరేకించిన 60 ఏళ్ల వృద్ధురాలిని కొందరు కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. హోలీని పురస్కరించుకుని మేవటి టోలా ప్రాంతంలోని వృద్ధురాలి ఇంటి వద్ద ఈ ఉదయం 10 గంటల సమయంలో కొందరు హోలీ జరుపుకుంటున్నారు. వారి అల్లరిని భరించలేని వృద్ధురాలు ఇక్కడ హోలీ జరుపుకోవద్దని, వెళ్లిపోవాలని సూచించింది.


అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు ఆమె మాటలకు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంట్లోకి ప్రవేశించి  రాళ్లు, కర్రలతో చావబాదడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు ఎస్పీ ప్రశాంత్ కుమార్ ప్రసాద్ తెలిపారు. వృద్ధురాలిపై దాడిచేసిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వృద్ధురాలిని కాపాడేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-30T01:45:05+05:30 IST