గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-01-29T05:52:42+05:30 IST

ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మండలంలోనికందకుర్తి గోదావరిలో చోటు చేసుకుంది.

గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం

నవీపేట (రెంజల్‌), జనవరి 28: ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మండలంలోనికందకుర్తి గోదావరిలో చోటు చేసుకుంది. ఎస్సై నర్సయ్య తెలిపిన వివరాల ప్రకా రం.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం ఉప్పలపాలెంనకు చెందిన వరలమ్మ భర్త ఈశ్వరయ్యతో కలిసి మహారాష్ట్రలోని నాయేగావ్‌లో నాలుగు మాసాలుగా ఉంటున్నారు. చేపలు పట్టుకుని జీవిస్తున్నారు. బుధవారం వరలమ్మ స్నానం చేయడానికి నాయేగావ్‌ వైపు ఉన్న గోదావరిలో దిగగా ప్రమాదవశాత్తు నీట మునిగిపోయింది. వరలమ్మ మృతదేహం శుక్రవారం కందకుర్తి శివారులోని గోదావరిలో లభ్యమైంది. మృతురాలి భర్త ఈశ్వరయ్య ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని తహసీల్దార్‌ రాంచందర్‌ సమక్షంలో పంచనామ నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.
టాక్టర్‌ ట్రాలీ అపహర ణ
డిచ్‌పల్లి, జనవరి 28: మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై పక్కన గల ఓ షెడ్డులో నిలిపిన టాక్టర్‌ ట్రాలీని గుర్తుతెలియని వ్యక్తులు అపహారించు కు పోయారని బాధిత రైతు నరేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఆచూకీ తెలిస్తే 9705046250, 9440795421 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని బాధిత రైతు కోరారు.
మూడు ఇసుక ట్రాక్టర్ల పటి ్టవేత
కోటగిరి, జనవరి 28: మండలంలోని సుంకిని మంజీర నది తీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను శుక్రవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా సుంకిని నుంచి హెగ్డోలి వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ శేఖర్‌ హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతితోనే ఇసుకను తీసుకెళ్లాలన్నారు.

Updated Date - 2022-01-29T05:52:42+05:30 IST