Abn logo
Sep 20 2021 @ 15:27PM

కుక్క కోసం బిజినెస్ క్లాస్ క్యాబిన్ అంతా బుక్ చేసింది

విమానంలో ప్రయాణం చేయటం, మనుషులకే పెద్ద కల. అది... అందరికీ తీరుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. కానీ, ఆ కుక్క ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేసింది. పైగా మనషుల మాదిరిగా పక్కపక్కన ఇతరులతో సీట్లు షేర్ చేసుకుంటూ కాదు. తన యజమానురాలతో పాటూ మొత్తం క్యాబిన్ అంతా దర్జాగా తనే వాడేసింది!  


ముంబై నుంచీ చెన్నై వెళుతోన్న ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్‌లో, ఒక మహిళా ప్రయాణీకురాలు, మొత్తం బిజినెస్ క్లాస్ క్యాబిన్ అంతా బుక్ చేసేసింది. అందులో ఆమెతో పాటూ కేవలం తన పెట్ డాగ్ మాత్రమే ప్రయాణించింది. వింతగా అనిపించే ఈ సంఘటన గురించి ఎయిర్ ఇండియా అధికారులు పెద్దగా వివరాలు తెలియజేయటం లేదు. కానీ, ఎయిర్‌బస్ 321‌లో 12 బిజినెస్ క్లాస్ సీట్లు ఉన్న ఓ క్యాబిన్ మొత్తం ఒక్కరే బుక్ చేశారని మాత్రం అంగీకరించారు. 


ముంబై నుంచీ చెన్నై వెళ్లటానికి ఒక్క బిజినెస్ క్లాస్ టికెట్టుకే 20 వేలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే, తన పెంపుడు కుక్క కోసం సదరు ఎయిర్ ఇండియా ప్రయాణీకురాలు 2 లక్షలకు పైగానే వ్యయం చేశారని చెప్పవచ్చు.              


ఇవి కూడా చదవండిImage Caption