Advertisement
Advertisement
Abn logo
Advertisement

విమానంలో పెంపుడు పిల్లికి పాలిచ్చిన మహిళ

న్యూయార్క్: ఓ మహిళ విమానంలో ప్రయాణిస్తూ తన పెంపుడు పిల్లికి పాలిచ్చిన ఘటన సంచలనం రేపింది. గుర్తుతెలియని ఓ మహిళ న్యూయార్క్‌లోని సిరక్యూస్ విమానాశ్రయం నుంచి జార్జియాలోని అట్లాంటాకు వెళుతున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలోని 13 ఏ సీటులో కూర్చొని తన పెంపుడు పిల్లికి పాలిచ్చింది. పిల్లికి పాలిస్తున్న మహిళా ప్రయాణికురాలిని చూసిన తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వెంట్రుకలు లేని పెంపుడు పిల్లిని దుప్పటిలో కప్పిన మహిళ విమానం ఎక్కడంతో అది శిశువులా కనిపించిందని ఫ్లైట్ అటెండెంట్ ఐన్ల్సీ ఎలిజబెత్ చెప్పింది. విమానంలో పిల్లికి పాలివ్వడం ఆపాలని విమాన సిబ్బంది మహిళను కోరినా ఆమె నిరాకరించింది. 

ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రయాణికుడు ట్విట్టరులో పోస్టు చేశారు. విమానం ల్యాండింగ్ అయ్యాక ఎయిర్ లైన్ రెడ్ కోట్ బృందం రంగంలోకి దిగి పిల్లికి పాలిచ్చిన మహిళను ఆరా తీస్తుంది.విమానంలో పెంపుడు పిల్లికి పాలు ఇచ్చిన మహిళ టిక్ టాక్ వీడియోను ఫ్లైట్ అటెండెంట్ ఐన్స్లీ ఎలిజబెత్ కూడా షేర్ చేసింది. కాగా ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ ఇంకా స్పందించ లేదు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement