Abn logo
Oct 26 2021 @ 23:31PM

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

నాగలక్షుమ్మ (ఫైల్‌)

చక్రాయపేట, అక్టోబరు 26: మండలంలోని మారెళ్ల మడక గ్రామం కొండవాండ్లపల్లెకు చెందిన పట్టెం నాగలక్షుమ్మ (50) అప్పుల బాధ తాళలేక ఉరివేసు కొని మృతిచెందినట్లు ఆమె భర్త వెంకటనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రంగారావు వివరాల మేరకు... వెంకటనారాయణ నాగ లక్షుమ్మకు ఐదుగురు కుమార్తెలు. వారి పెళ్లిళ్లలకు అప్పు చేశారు. ఇందుకోసం ఉన్న పొలాన్ని అమ్ముకున్నా అప్పు తీర లేదు. దీంతో మనస్థాపం చెందిన నాగలక్షుమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ వివరించారు.