బ్యాంకులో మహిళా ఉద్యోగిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-04T14:47:10+05:30 IST

ఓ సహకార బ్యాంకులో మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన....

బ్యాంకులో మహిళా ఉద్యోగిని ఆత్మహత్య

కొల్లం (కేరళ): ఓ సహకార బ్యాంకులో మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కేరళ రాష్ట్రంలోని కొల్లం పట్టణంలో వెలుగుచూసింది. కొల్లం పట్టణానికి చెందిన సత్యవతి అనే మహిళ సహకార బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగినిగా పనిచేసే వారు. ఉద్యోగ సంబంధ సమస్యలతో సత్యవతి బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులు వచ్చి సత్యవతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. బ్యాంకులో మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-04T14:47:10+05:30 IST