Advertisement
Advertisement
Abn logo
Advertisement

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

సబ్బవరం, నవంబరు 28 : కొన్నేళ్లుగా తన కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడని మనస్తాపం చెందిన ఓ మహిళ శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ చంద్ర శేఖరరావు తెలిపిన వివరాల ప్రకారం గుల్లేపల్లి గ్రామానికి చెందిన గండి పరదేశి నాయుడు, రామలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె ఉమా ఎనిమిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మాడెం మహేశ్‌ను ప్రేమ వివాహం చేసు కుంది. అయితే ఆమెను భర్త మహేశ్‌, అత్త మహాలక్ష్మి కొంతకాలంగా వేధిస్తున్నారు. శనివారం ఆమెను వారు తీవ్రంగా కొట్టడమే కాకుండా పుట్టింటికి బలవంతంగా పంపే శారు. కుమార్తె పరిస్థితి చూసి తల్లి రామలక్ష్మి మనస్తాపానికి గురైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ సురేశ్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలి కుమార్తె ఉమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖరరావు కేసు చేశారు. ఎస్‌ఐ లకోజు సురేశ్‌ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement