Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా జీవితం నాశనం అయింది.. ఇలాంటి వాడు నాకు భర్తగా వద్దంటూ ఆవేదన.. ఆ భార్యకు వచ్చిన కష్టమేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్:  15 ఏళ్లుగా అదే నరకం! భర్త ఏ రోజూ ఆమెను ప్రశాంతంగా ఉండనీయలేదు. అతడు బయటకెళ్లినప్పుడే ఆమెకు మనశ్శాంతి. ఇంటికి వచ్చాడంటే మళ్లీ నరకం మొదలు. చిన్న చిన్న కారణాలతో తగవుకు దిగేవాడు. చేతికి ఏది దొరికితే దానితో చితకబాడేవాడు. ఈ మధ్య అతడి ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. దీంతో..ఇలాంటి వాడు నాకు భర్తగా వద్దంటూ ఓ నిర్ణయానికి వచ్చిన ఆమె చివరికి అతడికి తగిన శాస్తి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లా ఛత్తర్‌పూర్ ప్రాంతానికి చెందిన సంగీతకు 15 ఏళ్లకే పెళ్లైంది. వివాహమైన కొద్ది రోజుల పాటు వారి సంసారం సాఫీగా సాగింది. కానీ..ఆ తరువాత ఆమె జీవితం సమూలంగా మారిపోయింది. ప్రత్యక్ష నరకం అంటే ఏంటో ఆమెకు తెలిసొచ్చింది. మద్యానికి బానిసైన భర్త ఆమె పాలిట రాక్షసుడిగా మారిపోయాడు. నిత్యం డబ్బులు కోసం వేధిస్తూ ఇల్లంతా గుల్ల చేస్తుండేవాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలన్నీ ఒలుచుకుపోయాడు. ఆమె ఆస్తినంతా అమ్మేశాడు. చివరికి ఆమె తన పుట్టింట్లో తలదాచుకోవడం ప్రారంభించింది. పిలల్నీ తన వెంట తీసుకెళ్లిపోయింది. 

కానీ.. భర్త ఆగడాలు మాత్రం ఆగకపోగా మరింత పెరిగాయి. దీంతో.. ఆమెకు పుట్టింట్లో ఉన్నా కూడా వేధింపులు తప్పలేదు. మరోవైపు.. ఆమె ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. తండ్రి నిర్వాకాలు వారిపై క్రమంగా ప్రభావం చూపించడం ప్రారంభించాయి. ఇదంతా గమనిస్తూ ఉన్న సంగీత చివరికి ఓ నిర్ణయానికి వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా ఇటీవల ఓ రోజున స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఇలాంటి వాడు తనకు భర్తగా వద్దంటూ అతడు ఇంతకాలం చేసిన ఆగడాలను బయటపెట్టింది. తన జీవితాన్ని నాశనం చేసిన భర్తపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. అతడు చివరికి కటకటాల పాలయ్యాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement